గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : ఆదివారం, 10 సెప్టెంబరు 2023 (20:54 IST)

హైటెక్ సిటీ నడిబొడ్డున ప్రారంభమైన మహోన్నత వంటల అనుభవం 'కంచి కేఫ్'

image
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'కంచి కేఫ్' హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో వైభవంగా ప్రారంభమైంది. ఈ ప్రత్యేకమైన కేఫ్, సాంప్రదాయ వంటకాల రుచిని మాత్రమే కాదు, మూర్తీభవించే ఆధ్యాత్మిక మంచితనాన్ని కూడా ఆస్వాదించడానికి నగరవాసులను ఆహ్వానిస్తుంది. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు గౌరవనీయులైన 'పూజ్య శ్రీ దేవప్రసాద్‌దాస్‌జీ స్వామి,' ప్రత్యేకంగా హాజరయ్యారు. భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనం 'కంచి కేఫ్'. దీనిని ప్రత్యేకంగా పవిత్రమైన కాంచీపురం ఆలయ ప్రేరణ తో తీర్చిదిద్దారు. ఆలయంలోని నిర్మలమైన వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఇక్కడ అలంకరణ చేశారు. 
 
image
"మేము 'కంచి కేఫ్'లో అందించేది కేవలం ఆహారం మాత్రమే కాదు; ఇది దక్షిణ భారతదేశం యొక్క మహోన్నత సంప్రదాయాలకు చేసే ఒక లీనమయ్యే ప్రయాణం," అని టీ టైమ్ మరియు కంచి కేఫ్ యొక్క వ్యవస్థాపకుడు శ్రీ ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్ల చెప్పారు. "ప్రతి భోజనం రుచులు మరియు ఆధ్యాత్మికత యొక్క సమ్మేళనంగా ఉండాలని మేము నమ్ముతున్నాము. హైటెక్ సిటీకి ఈ ప్రత్యేకమైన అనుభవాన్ని అందించడానికి మేము సంతోషిస్తున్నాము" అని అన్నారు. 'కంచి కేఫ్'ని మిగిలిన వాటికి వేరుగా ఉంచేది ఏమిటంటే, సున్నితమైన సాంప్రదాయ అల్పాహార మెనూని అందించడంలో దాని అంకితభావం. మెనూలో చక్కర పొంగల్, టెంపుల్ పులిగారే, రవ్వ కిచిడి, తట్టు ఇడ్లీ, నెయ్యి రాగి దోస మరియు మరెన్నో రుచికరమైన, ప్రామాణికమైన వంటకాలు ఉన్నాయి.  
 
image
భారతదేశం అంతటా 3800 ఔట్‌లెట్‌లను కలిగి ఉన్న ప్రఖ్యాత  చాయ్-చైన్ 'టీ టైమ్' ద్వారా ఈ పాక రత్నాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నారు. టీ టైమ్ కోసం ఒక సాహసోపేతమైన కొత్త వెంచర్‌ను 'కంచి కేఫ్' సూచిస్తుంది. సాంప్రదాయ వంటకాల యొక్క ప్రామాణికమైన రుచిని దేశానికి పరిచయం చేయాలనే లక్ష్యం కు ప్రతీకగా ఇది నిలుస్తుంది.