సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 2 డిశెంబరు 2023 (20:28 IST)

కోటక్ గ్లోబల్ సర్వీస్ ఖాతా -ఒక సమగ్ర కరెంట్ ఖాతా

loan cashback
కోటక్ మహీంద్రా బ్యాంక్ సేవా ఎగుమతి రంగం యొక్క ప్రత్యేక బ్యాంకింగ్ అవసరాలను తీర్చడానికి సమగ్ర కరెంట్ ఖాతాగా 'గ్లోబల్ సర్వీస్ అకౌంట్'ని ప్రారంభించినట్లు ఈరోజు ప్రకటించింది. ఈ ప్రతిపాదన అంతర్జాతీయ ఉనికి, క్లయింట్లు, ఉద్యోగులతో కూడిన వ్యాపార సంస్థలు ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్‌తో ఇతర వాటితో సహా ప్రాధాన్యత కలిగిన కస్టమర్ సేవ, ఫారెక్స్ మార్కెట్‌లు మరియు ట్రెండ్‌లపై అడ్వైజరీ సర్వీసెస్, ట్రేడ్ ఎక్స్‌పర్ట్‌‌లకు యాక్సెస్, డిజిటల్ సొల్యూషన్స్, సమయానికి జీతాలు, విక్రేత చెల్లింపుల కోసం లెండింగ్ సొల్యూషన్స్ వంటి అనేక రకాల ఉత్పత్తులు, సేవలను యాక్సెస్ చేసేందుకు వీలు కల్పిస్తుంది.
 
భారత ప్రభుత్వ వాణిజ్య- పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన వాణిజ్య శాఖ, ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ ప్రకారం, సర్వీస్ ఎక్స్‌ పోర్ట్1 రంగం 2022 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, 2023 ఆర్థిక సంవత్సరంలో $323 బిలియన్లకు చేరుకొని భారత దేశం లోని మొత్తం ఎగుమతుల్లో 40%కి 26.8% వృద్ధి రేటుతో దోహదం చేస్తోంది. విభిన్న సేవలను ప్రత్యేకంగాఎంచుకోవాల్సిన అవసరం లేకుండా, ఒకే కరెంట్ ఖాతాలో గ్లోబల్ బిజినెస్‌ల కోసం కీలకమైన బ్యాంకింగ్ ఉత్పత్తులు, సేవలను అందించడం ద్వారా కస్టమర్ అనుభవాన్ని సులభతరం చేయడం కోటక్ లక్ష్యం. గ్లోబల్ సర్వీస్ ఖాతా కన్సల్టెన్సీ, సాఫ్ట్‌ వేర్, బిపిఓ, ఇ-కామర్స్, టూర్ & ట్రావెల్, హాస్పిటాలిటీ, ట్రాన్స్‌ పోర్ట్ వంటి రంగాలలో అంతర్జాతీయ కార్యకలాపాలను పెంచుతూ ప్రపంచ సేవలను అందిస్తుంది.
 
కోటక్ మహీంద్రా బ్యాంక్ రిటైల్ లయబిలిటీస్ ప్రోడక్ట్ ప్రెసిడెంట్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, రోహిత్ భాసిన్ మాట్లాడుతూ, "మా గ్లోబల్ సర్వీస్ ఖాతా వ్యాపార సంస్థల కోసం బ్యాంకింగ్, ఫైనాన్స్ సంబంధిత లావా దేవీలను వాటి అంతర్జాతీయ కార్యకలాపాలతో సమగ్ర, తిరుగులేని పద్ధతిలో పెంపొందిస్తుంది. మా కస్టమర్ల అవసరాలకు ప్రాధాన్యతనిచ్చే పరిష్కారాలను అభివృద్ధి చేయడం కొనసాగిస్తాం, మాతో బ్యాంక్ చేయడం ఆనందదాయకంగా చేస్తాం’ అని అన్నారు.
 
'గ్లోబల్ సర్వీస్ అకౌంట్' రెండు కరెంట్ అకౌంట్ వేరియంట్‌లను అందిస్తుంది: 'గ్లోబల్ సర్వీస్ అకౌంట్ ఏస్' మరియు 'గ్లోబల్ సర్వీస్ అకౌంట్ ఎలైట్'. రెండు వేరియంట్‌లు ట్రేడ్, ఫారెక్స్ లావాదేవీల కోసం ప్రత్యేకమైన, ప్రాధాన్య ప్రైసింగ్ అందిస్తాయి. ప్రాధాన్య పాస్ ద్వారా ప్రత్యేకమైన వీఐపీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ సదుపాయాలతో బిజినెస్ ప్లాటినం డెబిట్ కార్డ్‌ కు యాక్సెస్‌ను మంజూరు చేస్తాయి. ఇంకా, సగటు త్రైమాసిక బ్యాలెన్స్ (AQB) లేదా త్రైమాసిక త్రూపుట్ నిర్వహించడంలో సౌలభ్యాన్ని కూడా అందిస్తుంది, వ్యాపార సంస్థలు తమ ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ అనుభవాన్ని పొందగలవని నిర్ధారిస్తుంది.