గురువారం, 21 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 9 జులై 2024 (23:17 IST)

మొత్తం BS6 OBD II శ్రేణిపై మైలేజ్ గ్యారంటీని ఆవిష్కరించిన మహీంద్రా

trucks
మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ కమర్షియల్ వాహన విభాగంలో అగ్రగామిగా కొనసాగుతూ, తమ మొత్తం BS6 OBD II శ్రేణి వాహనాలపై కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చే విప్లవాత్మకమైన ప్రతిపాదనను ప్రకటించింది. పెరుగుతున్న ఇంధన ధరలు, నియంత్రణపరమైన ప్రమాణాలతో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంలో తోడ్పడేందుకు పరిశ్రమలోనే తొలిసారిగా ‘మరింత మైలేజీ పొందండి లేదా ట్రక్కును వాపసు చేయండి’ అనే ప్రతిపాదనను ప్రవేశపెట్టింది. BS6 OBD II శ్రేణిలో హెచ్‌సీవీ, ఐసీవీ, ఎల్‌సీవీ ట్రక్కులకు సంబంధించి బ్లేజో ఎక్స్, ఫ్యూరియో, ఆప్టిమో, జయో (BLAZO X, FURIO, OPTIMO, JAYO) ఉన్నాయి.
 
“ట్రక్కుల శ్రేణివ్యాప్తంగా ‘గెట్ మోర్ మైలేజ్ ఆర్ గివ్ ది ట్రక్ బ్యాక్’ గ్యారంటీ అనేది ఒక కీలకమైన ప్రతిపాదన. మా అత్యుత్తమ హై-టెక్‌ అనుభవాన్ని, సెగ్మెంట్‌పైన మరియు ఎప్పటికప్పుడు మారుతున్న కస్టమర్ల అవసరాలపైనా మాకున్న అపార అవగాహనను ఇది ప్రతిబింబిస్తుంది. విస్తృతంగా నిర్వహించిన ఫ్లూయిడ్ ఎఫీషియెన్సీ టెస్టింగ్ దన్నుతో ప్రకటించిన ఈ మైలేజీ గ్యారంటీ ప్రోగ్రాం అనేది కస్టమర్లను సంతృప్తిపర్చడంలోనూ, నిర్వహణ సామర్ధ్యాలను మెరుగుపర్చడంలోనూ మాకున్న ఎనలేని నిబద్ధతకు నిదర్శనంగా నిలవగలదు. ఇలాంటి కార్యక్రమాలతో కస్టమర్ల మనసులను గెల్చుకుని, భారతదేశపు అగ్రగామి కమర్షియల్ సంస్థల్లో ఒకటిగా మహీంద్రా మరింతగా ఎదగగలదు” అని మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ప్రెసిడెంట్ (ట్రక్స్, బసెస్, సీఈ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ బిజినెసెస్), మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు శ్రీ వినోద్ సహాయ్ తెలిపారు.  
 
“మా వాహనాల్లో ఉపయోగించే అత్యుత్తమ సాంకేతికతే అధిక ఫ్లూయిడ్ ఎఫీషియెన్సీకి దోహదపడింది. 2016లో మేము BS3 శ్రేణికి మైలేజ్ గ్యారంటీని ప్రవేశపెట్టాం. ఆ తర్వాత BS4, BS6 OBD1లకు కొనసాగించాం. ఇప్పుడు BS6 OBD2 కోసం ఆవిష్కరిస్తున్నాం. ఇది ట్రాన్స్‌పోర్టర్ల లాభదాయకతను పెంచేందుకు సహాయకరంగా ఉండగలదు. ఫ్రైట్ రేట్లు పెరగకుండా ఇంధన వ్యయాలు పెరిగిపోవడం వల్ల ట్రాన్స్‌పోర్ట్ క్లయింట్ల మార్జిన్లపై ప్రతికూల ప్రభావం పడుతుండటాన్ని మేము గమనించాం. కొత్త ప్రమాణాలకు అనుగుణంగా, అలాగే మా కస్టమర్ల అంచనాలకు మించి పనితీరు కోసం ఇంధన సామర్ధ్యాలను మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని గుర్తించాం. “జ్యాదా మైలేజ్ నహీతో ట్రక్ వాపస్”  నినాదంతో ప్రవేశపెట్టిన కొత్త మైలేజీ గ్యారంటీ ప్రోగ్రాం అనేది మా కస్టమర్లకు అసమానమైన ప్రయోజనాలు చేకూర్చగలదు” అని మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ బిజినెస్ హెడ్ (కమర్షియల్ వెహికల్స్) శ్రీ జలజ్ గుప్తా తెలిపారు.