శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (22:26 IST)

ఐదు కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు- మహీంద్రా టీజర్ రిలీజ్

Mahindra
Mahindra
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా వచ్చే మూడేళ్లలో ఐదు కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను విడుదల చేయనుంది. మోడల్స్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటిని XUV.e8, XUV.e9, BE.05, BE Rall-E, BE.07 పేర్లతో విక్రయించనుంది.
 
ఇందులో భాగంగా మొదటి మోడల్ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో, మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. టీజర్‌లో XUV.e9, BE.05, XUV.e8 మోడల్‌లు ఉన్నాయి. 
 
వీటిలో ఫ్లష్-ఫిట్ డోర్ హ్యాండిల్స్, కొత్త ఎలక్ట్రిక్ కార్లపై ఎల్-ఆకారపు LEDలు ఉన్నాయి. DRLలు, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ అందించబడతాయి. 
 
అలాగే BE.05, XUV.e9 కార్లు LED కలిగి ఉంటాయి. లైట్ బార్, పనోరమిక్ సన్‌రూఫ్ అందించనున్నట్లు మహీంద్రా ఓ ప్రకటనలో వెల్లడించింది.