శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (20:34 IST)

ఆటో ఎక్స్‌పో 2020 : మార్కెట్‌లోకి మారుతి ఇగ్నిస్

దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన మారుతి సుజుకి కంపెనీ.. తాజాగా మారుతి సుజుకి ఇగ్నిస్ పేరుతో సరికొత్త కారును మార్కెట్‌లోకి విడుదల చేసింది. నిజానికి ప్రస్తుతం మారుతి సుజుకి ఏడు విభన్న మోడళ్ళు, నాలుగు రకాల రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ఇపుడు తాజాగా మారుతి సుజుకి ఇగ్నిస్ పేరుతో మరో కొత్త కారును లాంఛ్ చేసింది. 
 
మారుతి సుజుకి ఇగ్నిస్ ఆన్-రోడ్ ధర, ఇఎంఐ తెలుసుకోవచ్చు. పూర్తి వివరణతో కూడిన పోలిక ద్వారా మారుతి సుజుకి ఇగ్నిస్, ఇతర ఎమ్‌యూవీ వాహనల గురించి సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు. మారుతి ఇగ్నిస్ పూర్తి వివరాలను పరిశీలిస్తే, 
 
మారుతి సుజుకి ఇగ్నిస్ సిగ్మా 1.2 ఎంటీ రకం మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.4.83 లక్షలు
మారుతి సుజుకి ఇగ్నిస్ డెల్టా 1.2 ఎంటీ రకం మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.5.60 లక్షలు 
మారుతి సుజుకి ఇగ్నిస్ జీటా 1.2 ఎంటీ రకం మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.5.83 లక్షలు
మారుతి సుజుకి ఇగ్నిస్ డెల్టా 1.2 ఏఎంటీ రకం మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.07 లక్షలు
మారుతి సుజుకి ఇగ్నిస్ జీటా 1.2 ఏఎంటీ రకం మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.30 లక్షలు
మారుతి సుజుకి ఇగ్నిస్ ఆల్ఫా 1.2 ఎంటీ రకం మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.66 లక్షలు
మారుతి సుజుకి ఇగ్నిస్ ఆల్ఫా 1.2 ఏఎంటీ రకం మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.7.13 లక్షలు.