శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 జనవరి 2020 (12:07 IST)

మార్కెట్లోకి టాటా నుంచి కొత్త కారు... ధర రూ.5.29లక్షలు

టాటా నుంచి కొత్త కారు మార్కెట్లోకి వచ్చింది. టాటా మోటార్స్‌ కొత్త కారు ఆల్ట్రోజ్‌ను సదరు సంస్థ బుధవారం విడుదల చేసింది. దీతంతో ప్రీమియం హాచ్‌ బ్యాక్‌ విభాగంలోకి కంపెనీ ప్రవేశించినట్లయింది. బీఎస్‌ 6 ప్రమాణాలతో కూడిన ఈ కారు ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ధర రూ.5.29 లక్షలు. అల్ఫా ప్లాట్‌ఫామ్‌పై దేశీ మా ర్కెట్లోకి వచ్చిన తొలి కారు ఇదే కావడం గమనార్హం. 
 
బీఎస్‌ 6 ప్రమాణాలు గల ఆల్ట్రోజ్ కారు రిథమ్‌, స్టైల్‌, లగ్జె, అర్బన్‌ ప్యాక్‌లలో ఆరు కస్టమైజ్డ్‌ ఆప్షన్లతో దేశంలోని అన్ని డీలర్ షిప్ షో రూంలలో అందుబాటులో ఉంటాయి. హై-స్ట్రీట్ గోల్డ్, స్కైలైన్ సిల్వర్, డౌన్టన్ రెడ్, మిడ్‌టౌన్ గ్రే, అవెన్యూ వైట్ వంటి రంగుల్లో ఈ కారు అందుబాటులో వుంటుందని టాటా ఓ ప్రకటనలో వెల్లడించింది. 5-స్పీడ్ మ్యానువల్ గియర్ బాక్స్‌తో ఈ కారులో రెండు ఇంజన్లు వుంటాయి.