ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (09:14 IST)

నాగరిక ప్రపంచంలో నోట్ల రద్దు విజయవంతం కాలేదు : మన్మోహన్

నోట్ల రద్దుపై మాజీ ప్రధాని, ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మరోమారు సునిశిత విమర్శలు చేశారు. నోట్ల రద్దు ఓ విఫలయత్నమని, లాటిన్ అమెరికా వంటి కొన్ని దేశాల్లోనే ఇది విజయవంతమైందని గుర్తు చేశారు. అంతేకా

నోట్ల రద్దుపై మాజీ ప్రధాని, ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మరోమారు సునిశిత విమర్శలు చేశారు. నోట్ల రద్దు ఓ విఫలయత్నమని, లాటిన్ అమెరికా వంటి కొన్ని దేశాల్లోనే ఇది విజయవంతమైందని గుర్తు చేశారు. అంతేకానీ, నాగరిక ప్రపంచంలో ఎక్కడా నోట్ల రద్దు సక్సెస్ కాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
మొహాలీలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లీడర్ షిప్ సమ్మిట్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమంలోకి వెళ్లిపోయిందన్నారు. ఆర్థికంగా, సాంకేతికంగా.. ఏ విధంగా చూసినా ఈ ‘సాహసం’ వల్ల ఉపయోగం లేకుండా పోయిందన్నారు.
 
నోట్ల రద్దు నిర్ణయం సరైనదేనా? అన్న ప్రశ్నకు మన్మోహన్ బదులిస్తూ.. తానైతే అలా అనుకోవడం లేదన్నారు. చలామణిలో ఉన్న 86 శాతం నగదును ఉపసంహరించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగిందన్నారు. నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ల వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉండే అవకాశం ఉందని, అయితే తాత్కాలికంగా మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. వాటిని అధిగమించాల్సి ఉంటుందన్నారు.