హీరో ఎలక్ట్రిక్ సూపర్ ఆఫర్.. మరో టూ వీలర్ ఉచితం ఎలా?
హీరో ఎలక్ట్రిక్ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. 30 రోజులు, 30 స్కూటర్లు పేరుతో వచ్చిన ఈ ప్రకటన పండుగవేళ మంచి హాట్ టాపిక్ అయింది. స్టాండ్ ఏ ఛాన్స్ టూ విన్ ఏ హీరో ఎలక్ట్రిక్ ఎవ్విరీ డే అనే ఆఫర్ అక్టోబర్ 7నుంచి నవంబర్ 7వరకూ వ్యాలిడిటీలో ఉంటుంది.
ఇది దక్కించుకోవాలంటే దేశవ్యాప్తంగా ఉన్న 700+ హీరో డీలర్ షిప్ లేదా వెబ్‌సైట్‌లో స్కూటర్ కొనుగోలు చేయాలి. రోజూ హీరో ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనుగోలు చేసే వినియోగదారులలో లక్కీ కస్టమర్ తాను కోరుకున్న మరో హీరో ఎలక్ట్రిక్ టూ వీలర్ ఉచితంగా గెలుచుకునే అవకాశం ఉంటుంది.
30 రోజుల్లో హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే కస్టమర్లు అందరూ ఈ పోటీలో పాల్గొనడానికి అర్హులు. విజేతలను లక్కీ డ్రా ద్వారా తీయనున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ కొన్న తర్వాత ఎక్స్ షోరూమ్ ధరను పూర్తిగా రీఫండ్ చేస్తారు. హీరో ఎలక్ట్రిక్ ఆన్ లైన్, ఆఫ్ లైన్ సర్వీసులు అందిస్తుంది.
హీరో ఎలక్ట్రిక్ తక్కువ ధరతో ఈఎమ్ఐ సులభమైన ఫైనాన్సింగ్, వినియోగదారులకు లిథియం అయాన్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై 5 సంవత్సరాల వారంటీ వంటి సదుపాయాలు కల్పిస్తుంది హీరో. నాలుగేళ్ల తర్వాత బ్యాటరీ, ఛార్జర్‌పై ఎటువంటి వారంటీ వర్తించదు.