గురువారం, 8 జూన్ 2023
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (22:26 IST)

మింత్రా బ్రాండ్ రాయబారుల సమూహంలో చేరిన పాన్-ఇండియా స్టార్ తమన్నా భాటియా

image
మింత్రాతో ప్రముఖ నటి మరియు ఫ్యాషనిస్టు తమన్నా భాటియా బ్రాండ్ రాయబారిగా తన భాగస్వామ్యాన్ని ప్రకటింగా, ఇది భారతదేశంలోని అగ్రగామి ఫ్యాషన్, బ్యూటీ, జీవనశైలి షాపింగ్ డెస్టినేషన్లలో సెలబ్రిటీ కోషియంట్‌ను మరింత వృద్ధి చేసింది. తమన్నా, త్వరలోనే ప్రసారమయ్యే మింత్రా వారి సరికొత్త బ్రాండ్ క్యాంపెయిన్‌లో కనిపించనున్నారు. మింత్రా బ్రాండ్ రాయబారిగా కొనసాగుతున్న విజయ్ దేవరకొండతో తన ఫ్యాషన్ అభిప్రాయాలను పూజించే ప్రజాదరణ పొందిన ఈ నటులు వారి నటనా ప్రతిభతో మింత్రాకు విశిష్ట, పరిణామకారి బ్రాండ్ క్యాంపెయిన్‌ను సృష్టించేందుకు సిద్ధమయ్యారు.
 
మింత్రా సరికొత్త బ్రాండ్ క్యాంపెయిన్, ‘బి ఎక్స్‌ట్రార్డినరీ ఎవిరీ డే’లో ఫ్యాషన్ ఎప్పుడూ కేంద్ర స్థానంలో ఉంటుండగా, ఇది దేశ వ్యాప్తంగా ఫ్యాషన్ కోసం వేసి చేసే కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకుని మింత్రాను ప్రజలకు, వారి దైనందిక ఫ్యాషన్ మరియు స్టైల్‌ను ఉన్నతీకరించడం ద్వారా వారికి బ్రాండెడ్ ఫ్యాషన్‌లో అత్యుత్తమమైన దాన్ని లభించేలా చేస్తుంది.
 
భారతదేశపు చిత్రపరిశ్రమలో సూపర్ హిట్ సినిమాలలో నటించిన తమన్నా తన వైవిధ్యత, నటనా సామర్థ్యం, నటనా శైలి ఆమె తాజా ఫ్యాషన్ శైలితో వారికి భారతదేశ వ్యాప్తంగా హార్డ్‌కోర్ అభిమానులను సంపాదించి పెట్టింది. వారి విస్తృత సామాజిక మాధ్యమ ఫాలోయింగ్‌తో మింత్రాకు మరింత కమ్యూనికేషన్లను మరింత ఉత్తేజించేందుకు సహకరించనుంది. రణబీర్ కపూర్, కియారా అద్వానీ, విజయ్ దేవరకొండ తరహాలో తమన్నా కూడా మింత్రాకు ప్రతినిధిగా సూపర్ స్టార్ల జాబితాలో చేరుకుంటుండగా, దేశంలోని సినిమా రంగంతో ఈ ప్లాట్‌ఫారానికి అనుసంధానాన్ని వృద్ధి చేయనున్నారు. మింత్రాను అత్యాధునిక ట్రెండ్ నోట్‌లు, ఫ్యాషన్ ప్రాధాన్యతల కేంద్రంగా మార్చనున్నారు.
 
విజయ్ దేవరకొండను 2021లో మింత్రా తన బ్రాండ్ రాయబారి అని ప్రకటించింది. అప్పటి నుంచి ఆయన విజయవంతంగా బ్రాండ్‌కు మద్దతు ఇస్తూ వస్తుండగా, పురుషుల దుస్తుల విభాగంలో నెరేటివ్‌లను ఉత్తేజిస్తున్నారు. ఈ ప్లాట్‌ఫారాన్ని భారతదేశంలో ఫ్యాషన్ పట్ల ఆసక్తి ఉన్న వినియోగదారుల డిమాండ్లను భర్తీ చేసేందుకు ప్రచారాన్ని చేస్తున్నారు. వారి కళ, ఫ్యాషన్ వ్యక్తిత్వం, వారి సామాజిక మాధ్యమాలలో నిత్యం పెట్టే కంటెంట్ వారికి దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టింది.
 
ఈ క్యాంపెయిన్‌లో భాగంగా మింత్రా భారతదేశ వ్యాప్తంగా అగ్రగామి ఇన్‌ఫ్లుయెన్సర్లతో నాన్-మెట్రోలలోని వినియోగదారులతో ఆకర్షణీయమైన, ప్రస్తుత పోకడలకు అనుగుణమైన కంటెంట్ సృష్టించేందుకు అవకాశాన్ని కల్పించనుంది. బ్రాండ్ రాయబారుల ప్రకటన గురించి మింత్రా సీఎంఓ సుందర్ బాలసుబ్రహ్మణియన్ మాట్లాడుతూ, ‘‘తమన్నాను మా బ్రాండ్ రాయబారిగా చేర్చుకుంటున్నామని ప్రకటించేందుకు మేము చాలా సంతోషిస్తున్నాము, అలాగే మేము పరిణామకారి భాగస్వామ్యాన్ని నిరీక్షిస్తున్నాము. ఫ్యాషన్ మేము చేసే పని మధ్యలో ఉంటుంది. తమన్నా దక్షిణాది అలాగే, ఇతర ప్రాంతాలలో మింత్రాకు ప్రాతినిధ్యం వహించేందుకు మింత్రా స్టార్లతో చేరడం, ఈ క్యాంపెయిన్‌ను మరింత పెద్దదిగా చేసింది. పురుషుల దుస్తుల విభాగంలో విజయ్‌తో మా భాగస్వామ్యం అపారమైన యశస్సును దక్కించుకుంది. దేశ వ్యాప్తంగా వారి అభిమానులతో లోతైన బాంధవ్యాన్ని నిర్మించడాన్ని కొనసాగించనుంది’’ అని తెలిపారు.
 
ఈ భాగస్వామ్యం గురించి తమన్నా భాటియా మాట్లాడుతూ, ‘‘ఫ్యాషన్ రంగంలో అగ్రగామి బ్రాండ్‌తో భాగస్వామ్యం అత్యంత ఉత్సాహకరంగా ఉంది. మింత్రా బ్రాండ్ క్యాంపెయిన్‌లో పాల్గొనడం అత్యంత సంతోషకరం కాగా, దేశ వ్యాప్తంగా నా అభిమానులకు మరింత చేరువగా ఉండేందుకు అవకాశం కల్పిస్తుంది. వారికి మింత్రా ద్వారా నిత్యం స్టైల్‌ను ఉన్నతీకరించుకునేందుకు సహకరించనుంది’’ అని తెలిపారు.