శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 25 నవంబరు 2022 (22:29 IST)

ఆంధ్ర, తెలంగాణా మార్కెట్‌ల కోసం ప్రత్యకంగా కారం, ధనియాలు, పసుపు పొడి విడుదల

Masala
టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌కు చెందిన టాటా సంపన్న్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాతో పాటుగా కర్నాటక మార్కెట్‌లను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా మసాలాలు విడుదల చేసింది. ఇప్పటికే పాలిష్‌ చేయని పప్పులు, అత్యున్నత నాణ్యత కలిగిన నిత్యావసరాలు, సహజసిద్ధమైన నూనెలు సహా నాణ్యమైన ఆహార పదార్ధాలను టాటా సంపన్న్‌ ఈ మార్కెట్‌లలో అందిస్తుంది. నాణ్యమైన ఉత్పత్తులను తమ వినియోగదారులకు అందించాలనే కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌; తెలంగాణా, కర్నాటక రాష్ట్రాల వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని పులిహోర, మలబార్‌ చికెన్‌, సాంబార్‌ మసాలా, పసుపు, కారం, ధనియాల పొడి సహా విస్తృత శ్రేణిలో మసాలాలను సైతం ఇప్పుడు అందించబోతుంది.
 
ఈ సందర్భంగా టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ (ఇండియా) ప్రెసిడెంట్‌ దీపికా భాన్‌ మాట్లాడుతూ, కొద్ది నెలల కిత్రమే దక్షిణ భారతదేశంలో మసాలాల మార్కెట్‌లో ప్రవేశించాము. ఇప్పుడు ఈ విభాగాన్ని మరింతగా విస్తరించడం పట్ల సంతోషంగా ఉన్నామన్నారు. దక్షిణ భారతదేశపు వినియోగదారుల అభిరుచులను పూర్తిగా అర్ధం చేసుకుని, వారి మనసుకు నచ్చే రీతిలో తమ ఉత్పత్తులను విడుదల చేశామంటూ ప్రతి భారతీయ కుటుంబానికీ అత్యున్నత నాణ్యత కలిగిన మసాలాలను అందించాలనేది తమ లక్ష్యమన్నారు.
 
ఈ మసాలాల ఆవిష్కరణలో భాగంగా తమ మొట్టమొదటి యాడ్‌ ఫిలిం క్యాంపెయిన్‌ను టాటా సంపన్న్‌ విడుదల చేసింది. ప్రియమణి-జ్ఞానమణి అంటూ కవల సోదరీమణులుగా దక్షిణాది తార ప్రియమణి దీనిలో నటించారు. ‘టేస్ట్‌ చేసే వాళ్లు ఫ్యాన్‌ అయిపోతారంటూ తాను ఈ ప్రకటనలో చేశానంటూ స్వతహాగా తాను టాటా సంపన్న్‌ వినియోగదారులినని వెల్లడించారు ప్రియమణి.