గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (22:30 IST)

హైదరాబాద్‌ మెట్రో రైల్‌తో భాగస్వామ్యం చేసుకున్న రేడియో సిటీ

Radio city
భారతదేశంలో అతి పెద్ద రేడియో నెట్‌వర్క్‌, రేడియో సిటీ ఇప్పుడు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ (హెచ్‌ఎంఆర్‌)తో  ప్రత్యేకంగా రేడియో స్టేషన్‌ బ్రాండింగ్‌ కోసం భాగస్వామ్యం చేసుకుంది. అత్యద్భుతమైన కట్టడాలు, పసందైన రుచులు, వినూత్నమైన సాంకేతిక సంస్థలకు నిలయం హైదరాబాద్‌, అయినప్పటికీ నగర మెట్రో వ్యవస్థ హైదరాబాద్‌కు వినూత్న గుర్తింపును తీసుకువచ్చింది.
 
హైదరాబాద్‌లోని సుప్రసిద్ధ మెట్రో స్టేషన్‌లలో తమ బ్రాండ్‌ గుర్తింపును పెంచుకోవడానికి ఒక అవకాశంగా రేడియో సిటీ భావిస్తోంది. అందువల్ల ఈ రేడియో స్టేషన్‌ తమ లోగోను 10 మెట్రో స్టేషన్‌లలో ప్రవేశ ద్వారాల వద్ద ప్రదర్శించే ఏర్పాట్లు చేసింది. ఈ స్టేషన్‌లలో సికింద్రాబాద్‌ ఈస్ట్‌, కెపీహెచ్‌బీ, అమీర్‌పేట, లకడీకాపూల్‌, నాంపల్లి, జెబీఎస్‌, ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌, రాయ్‌దుర్గ్‌, ఎంజీబీఎస్‌ ఉన్నాయి. ప్రతి మెట్రో స్టేషన్‌లోనూ 2నుంచి 3 లక్షల మంది ప్రయాణీకులు ప్రయాణించే అవకాశం ఉండటం వల్ల బ్రాండ్‌ తమ చేరికను మరింతగా విస్తరించగలదు.
 
బ్రాండ్‌ వృద్ధి వ్యూహం గురించి  రేడియో సిటీ చీఫ్‌ క్రియేటివ్‌ ఆఫీసర్‌ కార్తీక్‌ కల్లా మాట్లాడుతూ, ‘‘ తమ కార్యకలాపాలు  ప్రారంభించిన నాటి నుంచి రేడియో సిటీ ,  దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఎఫ్‌ఎం రేడియో స్టేషన్‌గా స్థానం సంపాదించుకుంది. కోరుకునే భాగస్వామ్యాల ద్వారా  బ్రాండ్లతో అనుసంధానితం కావడంతో పాటుగా సంబంధిత కంటెంట్‌ వ్యూహాలను రూపొందించడం ద్వారా మిలియన్ల మంది శ్రోతలతో కనక్ట్‌ అయ్యేందుకు కృషి చేస్తున్నాము.
 
హైదరాబాద్‌ మెట్రో రైల్‌తో మా భాగస్వామ్యం శ్రోతలపై సానుకూల స్పందన చూపుతుందని, మా బ్రాండ్‌తో మరింతగా వారు అనుబంధం పెంచుకునేందుకు తోడ్పడుతుందని మేము నమ్ముతున్నాము. అధిక సంఖ్యలో ప్రజలను ఆకర్షించడానికి మెటో ఓ ఉత్తమ మార్గం.  అక్కడ మా ఉనికి చాటడం వల్ల  మరింత మంది శ్రోతలను చేరుకోవాలన్నది మా వృద్ధి వ్యూహం. ఈ కార్యక్రమాలు మా చేరికను విస్తరించడంతో పాటుగా వినూత్నమార్గాలను వినియోగించుకుని అగ్రగామి సంస్థగా  మా  స్థాయిని సైతం ప్రదర్శిస్తుంది’’ అని అన్నారు.