మంగళవారం, 9 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

రిలయన్స్ జియోకు 50 కోట్ల యూజర్లు... బంపర్ ఆఫర్లతో ముందుకు...

relinace jio
దేశంలోని ప్రైవేట్ టెలికాం సంస్థల్లో అగ్రగామిగా ఉన్న రిలయన్స్ జియో సరికొత్త మార్క్‌ను సాధించింది. 50 కోట్ల మంది వినియోగదార్లతో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఈ శుభ సందర్భంగా జియో బంపర్ ఆఫర్లను ప్రకటించింది. రూ.349 ప్లాన్‌ను 12 నెలలు తీసుకుంటే అదనంగా మరో నెల ఉచితంగా అందివ్వనుంది. 
 
ఈ నెల 5వ తేదీ నుంచి అక్టోబరు 5వ తేదీ మధ్య రూ.349 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌లతో ఉన్న వినియోగదారులకు అపరిమిత 5జీ డేటాను ఉచితంగా అందించనుంది. ఇది ప్రీపెయిడ్ వినియోగదారులందరికీ వర్తించనుంది. 
 
సెప్టెంబరు 5 నుంచి 7వ తేదీ వరకు శుక్రవారం, శనివారం, ఆదివారంలలో ప్రత్యేక వీకెండ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 5జీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు ప్రస్తుత ప్లాన్‌తో సంబంధం లేకుండా అపరిమిత 5జీ డేటాను ఉచితంగాను, 4జీ యూజర్లు రూ.39తో ప్రత్యేక రీచార్జ్ చేసి రోజుకు గరిష్టంగా 3జీబీ 4జీ డేటా పొందవచ్చు. 
 
అలాగే, రిలయన్స్ జియో మరో కీలక ప్రకటనగా తమ జియో హోం సేవలను రెండు నెలల పాటు ఉచితంగా అందించనున్నట్టు తెలిపింది. దీనివల్ల వినియోగదారులు ఇంటి నుంచే హై స్పీడ్ కనెక్టివిటీని పొందవచ్చు. రూ.349 ప్లాన్‌ను వరుసగా 12 నెలల పాటు రీచార్జ్ చేసుకుంటే అదనంగా ఒక నెల ఉచిత సేవలు పొందవచ్చని రిలయన్స్ జియో తెలిపింది.