సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 27 డిశెంబరు 2021 (23:13 IST)

మార్చి 2022 నాటికి 5500 మెట్రిక్‌ టన్నుల ఇ-వ్యర్ధాలను ఆర్గానిక్‌గా సేకరించడం లక్ష్యంగా క్లీన్‌ టు గ్రీన్‌ ఆన్‌ వీల్స్‌

మునిచ్‌లో ప్రధాన కార్యాలయం కలిగి, సమగ్రమైన రివర్శ్‌ లాజిస్టిక్స్‌ పరిష్కారాలను అందించడంలో  అంతర్జాతీయంగా అగ్రగామిగా వెలుగొందుతున్న రివర్శ్‌ లాజిస్టిక్స్‌ గ్రూప్‌ (ఆర్‌ఎల్‌జీ), తమ క్లీన్‌ టు గ్రీన్‌ ఆన్‌ వీల్స్‌ కార్యక్రమం ప్రారంభించింది. కంపెనీ యొక్క ప్రతిష్టాత్మక ప్రచారం క్లీన్‌ టు గ్రీన్‌ (సీ2జీ)కు తాజా రూపు ఇది.

 
ఈ తాజా అవగాహన మరియు సేకరణ కార్యక్రమం 110 నగరాలు, 300 పట్టణాలలో జరుగనుండటంతో పాటుగా దేశవ్యాప్తంగా 40 లక్షల మంది ప్రజలను చేరుకోనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 9 కలెక్షన్‌ వాహనాలు పలు నగరాలు, పట్టణాలలో తిరగడంతో పాటుగా 5500 మెట్రిక్‌ టన్నుల ఇ-వ్యర్థాలను సేకరించనున్నాయి. దీనితో పాటుగా పాఠశాలలు, కార్పోరేట్‌ సంస్ధలు, బల్క్‌  వినియోగదారులు, రిటైలర్లు, రెసిడెంట్‌  వెల్ఫేర్‌ అసోసియేషన్ల నడుమ అవగాహన కార్యక్రమాలు  నిర్వహించడంతో పాటుగా ఆరోగ్య శిబిరాలనూ ఏర్పాటుచేయనున్నారు.

 
ఈ ప్రచారం దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఉత్తరాన న్యూఢిల్లీ, జమ్మూ; తూర్పున కోల్‌కతా, గౌహతి, రాంచి; పశ్చిమాన అహ్మదాబాద్‌  మరియు దక్షిణాన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో జరుగనుంది. ఈ కలెక్షన్‌వాహనాలతో పాటుగా ఉన్న సిబ్బంది ఇ-వ్యర్ధాలను  వినియోగదారుల నుంచి సేకరిస్తారు.

 
కంపెనీ యొక్క తాజా అవగాహన, కలెక్షన్‌ వ్యూహాలను గురించి ఆర్‌ఎల్‌జీ ఇండియా, మేనేజింగ్‌ డైరెక్టర్‌, రాధికా కాలియా మాట్లాడుతూ, ‘‘ మహమ్మారి పలు పరిశ్రమల వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపినప్పటికీ, ఆర్‌ఎల్‌జీ వద్ద మేము స్థిరంగా ఇ-వ్యర్ధ అవగాహన కార్యక్రమాన్ని ప్రజల నడుమ నిర్వహించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాం. క్లీన్‌ టు గ్రీన్‌ ఆన్‌ వీల్స్‌ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటుగా తగిన రీతిలో ఇ-వ్యర్ధాలను నాశనం చేయడం, రోజువారీ జీవితంలో రీసైక్లింగ్‌ సాంకేతికతలను వినియోగించడాన్ని ప్రోత్సహించడం చేస్తున్నాం’’  అని అన్నారు.

 
ఈ క్లీన్‌ టు గ్రీన్‌ ఆన్‌ వీల్స్‌  ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్‌, వెస్ట్‌ మారేడ్‌పల్లి, అరుణ్‌ నగర్‌ రోడ్‌ వద్ద విజయవంతంగా ఇ-వ్యర్థ సేకరణ చేయడంతో పాటుగా అవగాహన కార్యక్రమాలను సైతం నిర్వహించారు.