భారతదేశపు ఎలక్ట్రానిక్ వ్యర్థ సమస్యను తీర్చేందుకు ఆర్‌ఎల్‌జీ క్లీన్ టు గ్రీన్ ప్రచారం
సమగ్రమైన రివర్శ్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్‌లో అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన రివర్శ్ లాజిస్టిక్స్ గ్రూప్ (ఆర్‌ఎల్‌జీ) తమ ప్రతిష్టాత్మక క్లీన్ టు గ్రీన్ ప్రచారాన్ని గత సంవత్సరం మే నెలలో ప్రారంభించి ఈ సంవత్సరం మార్చి వరకూ నిర్వహించనుంది. ఎలక్ట్రానిక్స్ వ్యర్థాలను సురక్షితంగా నాశనం చేయడం పట్ల వినియోగదారులకు అవగాహన కల్పించడంతో పాటుగా బాధ్యతాయుతమైన సంస్థలతో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా రీసైక్లింగ్ విధానాలను అనుసరించేలా ప్రోత్సహించడం దీని ద్వారా లక్ష్యంగా చేసుకున్నారు. దీనిలో భాగంగా విజయవాడ నగరంలో పలు పాఠశాలలు, కాలేజీలు, కంపెనీలలో ప్రచారాన్ని నిర్వహించారు.
ఆర్‌ఎల్‌జీ యొక్క క్లీన్ టు గ్రీన్ కార్యక్రమం అపూర్వ విజయం సాధించింది. మొత్తంమ్మీద గత మూడేళ్లలో 2210 కార్యక్రమాలు భారతదేశ వ్యాప్తంగా నిర్వహించి 22,21,406 మంది వ్యక్తులను కలుసుకున్నారు. 2020-21 ఆర్ధిక సంవత్సరం కోసం 16 మే 2020లో ఈ ప్రచారం ఆరంభించి ఫిబ్రవరి చివరి నాటికి 328 కార్యక్రమాలను నిర్వహించి 29 నగరాల్లో 5,26,431 మందిని చేరుకున్నారు.
ఈ ప్రచారం గురించి శ్రీమతి రాధిక కాలియా, మేనేజింగ్ డైరెక్టర్, ఆర్‌ఎల్‌జీ ఇండియా మాట్లాడుతూ, గత మూడేళ్లగా ఈ కార్యక్రమానికి వస్తున్న స్పందన పట్ల చాలా ఆనందంగా ఉన్నాము. తగిన రీతిలో ఎలకా్ట్రనిక్ వ్యర్థాలను నాశనం చేయడంతో పాటుగా దానిని జాతీయ ప్రాధాన్యతగా తీసుకునేలా ప్రోత్సహించడం చేశాం. ఈ సంవత్సరం మీటీ నుంచి తమకు చక్కటి మద్దతు, ప్రోత్సాహం లభించింది అని అన్నారు
డాక్టర్ సందీప్ చటర్జీ, డైరెక్టర్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (మీటీ) మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా భారతదేశంలో బాధ్యతాయుతంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను నాశనం చేయడం, రీసైకిల్ చేయడం జరుగుతుంది. భారతదేశంలో ఈ-వ్యర్థాల నిర్వహణకు ఈ తరహా మరిన్ని కార్యక్రమాలు జరుగాల్సిన అవసరం ఉంది అని అన్నారు.