గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2023 (12:42 IST)

ఖాతాదారులకు చాక్లెట్స్.. ఎస్బీఐ కొత్త ప్లాన్

Chocolate to Delight
రుణాలను సరైన కాలంలో చెల్లించని ఖాతాదారులకు చాక్లెట్స్ ఇంటికి పంపే కొత్త టెక్నిక్‌ను ఎస్బీఐ అమలుకు తేనుంది. రుణాలను సకాలంలో చెల్లించక ఓవర్ డ్యూ అయిన వారి ఇంటికి చాక్లెట్లను ఎస్బీఐ పంపనుంది. 
 
కస్టమర్ల పట్ల రుణాలు వసూలు చేయడంలో కఠినంగా వ్యవహరిస్తాయనే సంగతి తెలిసిందే. అయితే ఎస్బీఐ చాక్లెట్లతో ఖాతాదారుల ఇళ్లకు వసూళ్ల అధికారులను పంపే ప్రణాళిక అమలులో ఉందని ఎస్బీఐ వర్గాలు తెలిపాయి. 
 
ఎస్బీఐ రిటైల్ లోన్ బుక్ జూన్ 2023 త్రైమాసికంలో రూ. 10,34,111 కోట్ల నుండి రూ. 16.46 శాతం పెరిగి రూ. 12,04,279 కోట్లకు చేరుకుంది. 
 
ఇది సంవత్సరానికి 13.9 శాతం వృద్ధి చెందింది. నిజానికి మొత్తం వ్యవస్థకు, దాదాపు 16 శాతం రెండంకెల రుణ వృద్ధి కేవలం రిటైల్ రుణాల ద్వారానే జరిగింది.