గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2024 (12:35 IST)

రోజుకు 100 రూపాయలు ఆదా చేస్తే కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే?

money
రోజుకు కేవలం 100 రూపాయలతో కూడా పొదుపును ప్రారంభించి కోట్లు సంపాదించవచ్చు. ఎలాగంటే.. ఇందుకోసం మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. వీటిలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా ప్రతిరోజూ కేవలం రూ.100 పెట్టుబడి చేయడం ద్వారా కోటీశ్వరులు కావచ్చు.
 
ఈ క్రమంలో రోజూ రూ. 100.. అంటే అది నెలకు రూ. 3000 అవుతుంది. ఇప్పుడు మీరు రూ. 3000ని మ్యూచువల్ ఫండ్ సిప్‌లో పెట్టుబడిగా పెడితే అది 30 సంవత్సరాల పాటు అదే మొత్తంలో పెట్టుబడి చేస్తే 30 సంవత్సరాలలో ఆ పెట్టుబడి మొత్తం రూ.10,80,000 అవుతుంది. 
 
సిప్ విధానంలో మీకు సాధారణంగా రిటర్న్స్ 12 నుంచి 19 శాతం వరకు లభిస్తాయి. ఈ నేపథ్యంలో మీరు 12శాతం రాబడిని పొందినట్లయితే, 30 సంవత్సరాల తర్వాత చేతికి వచ్చే మొత్తం రూ.1,05,89,741 అవుతుంది. వడ్డీ రూపంలోనే రూ.95,09,741 వస్తుంది.
 
ఒక వేళ మీకు 15 శాతం చొప్పున రిటర్న్స్ వస్తే మీకు వచ్చే మొత్తం రూ. 2,10,29,462 అవుతుంది. ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మీ డబ్బును అనేక రెట్లు పెంచుకోవచ్చు.