గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (22:55 IST)

అబిడ్స్‌, హైదరాబాద్‌‌లో తమ నూతన స్టోర్‌ను ప్రారంభించిన సోచ్‌

భారతదేశం ఎక్కువగా అభిమానించే మహిళల ఎథ్నిక్‌ వేర్‌ బ్రాండ్‌, సోచ్‌ తమ సరికొత్త స్టోర్‌ను అబిడ్స్‌, హైదరాబాద్‌లో  ప్రారంభించింది. ఈ స్టోర్‌ 2200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. రాష్ట్రంలో తమ పాదముద్రికలను బలోపేతం చేసుకోవడంలో బ్రాండ్‌ ప్రయత్నాలకు నిదర్శనంగా ఇది నిలుస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణా రాష్ట్రాలలో  20 స్టోర్లను సోచ్‌ నిర్వహిస్తుంది.
 
హైదరాబాద్‌లోని ఈ స్టోర్‌లో బ్రాండ్‌ యొక్క తాజా కలెక్షన్‌ ప్రదర్శించనున్నారు. ఎక్స్‌క్లూజివ్‌ కలెక్షన్‌లో ఫ్లూయిడ్‌ సిల్‌హ్యుటీస్‌, బ్రీజీ స్ట్రక్చర్స్‌, లైట్‌ వెయిట్‌ ఫ్యాబ్రిక్స్‌ వంటివి సైతం ఉంటాయి. విస్తృతశ్రేణిలో చీరలు, సల్వార్‌ సూట్లు, కుర్తాలు, టునిక్స్‌, కుర్తీ సూట్స్‌ మరియు డ్రెస్‌ మెటీరియల్స్‌ నుంచి వినియోగదారులు ఎంచుకోవచ్చు.
 
ఈ స్టోర్‌ ప్రారంభం సందర్భంగా వినయ్‌ చట్లానీ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఈవొ–సోచ్‌ అప్పెరల్స్‌ మాట్లాడుతూ ‘‘ హైదరాబాద్‌లో మా 12వ స్టోర్‌ను ప్రారంభించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. తద్వారా  దక్షిణ భారతదేశంలో మా చేరికను మరింతగా విస్తరించాం.  ఈ ప్రాంతంలోని మా వినియోగదారులకు మా నూతన కలెక్షన్‌ మొదలు అపారమైన అవకాశాలను సైతం అందించనున్నాం. అసలైన సోచ్‌ అనుభవాలను ఈ స్టోర్‌ అందించనుంది’’ అని అన్నారు.
 
దేశంలో సోచ్‌ గత 16 సంవత్సరాలుగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 53 నగరాలలో 136 స్టోర్లు సోచ్‌కు ఉన్నాయి. వీటితో పాటుగా సోచ్‌ ఇప్పుడు సెంట్రల్‌వద్ద షాప్‌ ఇన్‌ షాప్స్‌ నిర్వహిస్తుండటంతో పాటుగా తమ సొంత వెబ్‌సైట్‌ సోచ్‌ డాట్‌ కామ్‌, ఈ–కామర్స్‌ పోర్టల్స్‌ అయిన అమెజాన్‌, మింత్రా, ఫ్లిప్‌కార్ట్‌, టాటా క్లిక్‌, అజియో, న్యాకా వంటి వాటి వద్ద కూడా లభ్యమవుతుంది. ప్రధాన మెట్రో నగరాలతో పాటుగా టియర్‌ 2 పట్టణాలలో సైతం విస్తరించేందుకు ప్రణాళిక చేసింది సోచ్‌. దక్షిణ మరియు పశ్చిమ భారతదేశంలో విస్తృతమైన సోచ్‌ ఇప్పుడు ఉత్తర, తూర్పు భారతదేశాలలో తమ ఉనికిని బలంగా చాటడానికి ప్రయత్నిస్తోంది.