బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 మార్చి 2022 (11:15 IST)

మహిళలకు బ్యాడ్ న్యూస్ : మళ్లీ పెరిగిన బంగారం ధరలు

మహిళలకు బ్యాడ్ న్యూస్. దేశంలో మళ్లీ బంగారం, వెండి ధరలు పెరిగాయి. గురువారం బులియన్ మార్కెట్ ప్రకారం వీటి రేట్లలో తగ్గుదల కనిపించగా, శుక్రవారం మాత్రం ధరలు పెరిగాయి. ఆ ప్రకారంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో రూ.160 పెరుగదల కనిపించింది. 
 
దీంతో ఇది రూ.51760కు చేరుకుంది. అలాగే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలో రూ.150 పెరుగదలతో రూ.47450కు చేరుకుకుంది. అలాగే, వెండి ధరల్లో కూడా మార్పు ఉంది. కిలో వెండి రూ.600 మేరకు పెరిగి రూ.72900కు చేరింది. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా గత నెలలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఇవి క్రమంగా తగ్గుముఖం పట్టాయి.