గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 మార్చి 2022 (09:37 IST)

పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్-బంగారం ధరలు పెరిగాయ్

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే వున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దిగివచ్చింది.. బంగారం ఔన్స్‌కు 0.03 శాతం క్షీణించి 1942 డాలర్లకు తగ్గింది. ఇక, వెండి ధర ఔన్స్‌కు 0.32 శాతం తగ్గుదలతో 25.53 డాలర్లకు పడిపోయింది. 
 
అయితే దేశంలో పసిడి ధరలు శుక్రవారం పెరిగాయి. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 పైకి కదులుతూ రూ. 51,760కు చేరింది. 
 
ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరగడంతో రూ. 47,450కు ఎగిసింది.. ఇదే సమయంలో.. వెండి రేటు కూడా పెరిగింది. కిలో వెండి రూ. 600 పెరిగి రూ. 72,900కు చేరింది.