బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 నవంబరు 2020 (13:38 IST)

యూబీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. హోమ్ లోన్‌పై వడ్డీ తగ్గింపు

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. హోమ్ లోన్‌పై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఇది నవంబర్ 1వ తేదీ నుండి అమలులోకి వచ్చింది.

రూ.30 లక్షలకు పైగా తీసుకునే హోంలోన్స్‌కు ఇది వర్తిస్తుంది. ఇటీవల వివిధ బ్యాంకుల తమ తమ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ఇప్పుడు యూబీఐ వడ్డీ రేటును తగ్గించింది.
 
సాధారణ కస్టమర్లకు పది బేసిస్ పాయింట్లు తగ్గించగా, మహిళలకు మరో 5 బేసిస్ పాయింట్లు రాయితీని ఇస్తోంది. డిసెంబర్ 31వ తేదీ వరకు హోంలోన్ పైన ప్రాసెసింగ్ చార్జీలను పూర్తిగా మినహాయిస్తున్నట్లు తెలిపింది.

టేకోవర్ గృహరుణాలపై రూ.10,000 వరకు లీగల్, వాల్యుయేషన్ చార్జీలను ఎత్తివేసింది. యూబీఐతో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) కూడా వడ్డీ రేట్లు తగ్గించింది.