ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2022 (13:16 IST)

బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు?

banks
కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రతి ప్రభుత్వ రంగాన్ని కొద్దికొద్దిగా ప్రైవేటుపరం చేస్తూ వస్తున్న కేంద్రం ఇపుడు దేశంలోని బ్యాంకులను ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌‍సభలో చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. 
 
ఇదే అంశంపై ఆమె లోక్‌సభలో మాట్లాడుతూ, ఈ నెల రెండో తేదీ నాటికి దేశంలో వార్షిక నోట్ల చెలామణి 7.98 శాతం పెరిగి రూ.31.92 లక్షల కోట్లకు చేరుకుందని తెలిపారు. నగదు చెలామణిని వీలైనంత వరకు తగ్గించడం, నల్లధనాన్ని అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఇందులోభాగంగానే కేంద్ర ప్రభుత్వంతో పాటు భారత రిజర్వు బ్యాంకు కూడా డిజిటల్ కరెన్సీని ప్రోత్సహిస్తుందని తెలిపారు. 
 
అలాగే, డెబిట్ కార్డు లావాదేవీలపై ఎండీఆర్ చార్జీలు విధించకుండా బ్యాంకులను ఆదేశించినట్టు ఆమె ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అలాగే, గత అక్టోబరు నెలలో 7.01 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం, నవంబరు నాటికి 4.67 శాతానికి పెరిగిందన్నారు.