సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 23 జులై 2021 (23:03 IST)

దక్షిణ భారతదేశంలో ప్రవేశించనున్న వీ-రిటైల్‌ లిమిటెడ్‌

భారతదేశపు సుప్రసిద్ధ వాల్యూ ఫ్యాషన్‌ రిటైలర్‌ వీ-మార్ట్‌ రిటైల్‌ లిమిటెడ్‌ (వీ-మార్ట్‌), ప్రస్తుతం నిర్వహణలో ఉన్న అన్ని అన్‌లిమిటెడ్‌ స్టోర్లను సొంతం చేసుకోవడానికి ఒప్పందం చేసుకుంది. అరవింద్‌ ఫ్యాషన్స్‌ లిమిటెడ్‌ (ఏఎఫ్‌ఎల్‌)కు పూర్తి అనుబంధ సంస్థ అయిన అరవింద్‌ లైఫ్‌స్టైల్‌ బ్రాండ్స్‌ లిమిటెడ్‌ (ఏఎల్‌బీఎల్‌)కు చెందిన బ్రాండ్‌ అన్‌లిమిటెడ్‌.
 
అన్‌లిమిటెడ్‌ ప్రస్తుతం 74 వాల్యూ ఫ్యాషన్‌ స్టోర్లను దక్షిణ, పశ్చిమ భారతదేశాలలో నిర్వహిస్తుండటంతో పాటుగా ఫ్యాషన్‌ అప్పెరల్‌, యాక్ససరీలను స్త్రీ, పురుషులు మరియు చిన్నారులకు అందుబాటు ధరలలో అందిస్తుంది.
 
ఈ లావాదేవీలలో భాగంగా వీ–మార్ట్‌ ఇప్పుడు అన్‌లిమిటెడ్‌ బ్రాండ్‌ యొక్క స్టోర్లు, వేర్‌హౌస్‌లు, ఇన్వెంటరీతో పాటుగా వారి బుక్‌ వాల్యూను దాదాపు 150 కోట్ల రూపాయలకు సొంతం చేసుకోనుంది. ఈ స్టోర్ల ద్వారా రాబోయే కొద్ది సంవత్సరాలలో అందుకోబోయే మైలురాళ్ల ఆధారంగా నిర్ధిష్టమైన మొత్తాలను కూడా చెల్లించనున్నారు.
 
ఈ లావాదేవీలను గురించి వీ-మార్ట్‌ రిటైల్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ లలిత్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ, ‘‘ఉత్తర మరియు తూర్పు భారతదేశాలలో అగ్రగామి సంస్థలలో ఒకటి వీ-మార్ట్‌. ప్రధానంగా టియర్‌ 2,  3 నగరాలను లక్ష్యంగా చేసుకుని ఇది కార్యక్రమాలను  నిర్వహిస్తుంది. అన్‌లిమిటెడ్‌ స్టోర్లు ఇప్పుడు వీ-మార్ట్‌ ఫ్యామిలీ కిందకు రానున్నాయి. ఈ స్టోర్లను చేజిక్కుంచుకోవడంతో మేము మరో 74 స్టోర్లను మా పోర్ట్‌ఫోలియోకు జోడించాము. తద్వారా దక్షిణ, పశ్చిమ భారతదేశపు కుటుంబాల ఫ్యాషన్‌ అవసరాలను తీర్చనున్నాం. ప్రతి సంవత్సరం మేము 50కు పైగా స్టోర్లను ప్రారంభిస్తుంటాము. అదే రీతిలో మా వృద్ధి కొనసాగించగలమని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.
 
తమ పెట్టుబడుల ఉపసంహరణ గురించి శైలేష్‌ చతుర్వేది, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, అరవింద్‌ ఫ్యాషన్‌ మాట్లాడుతూ ‘‘అన్‌లిమిటెడ్‌ కోసం వీ మార్ట్‌ లాంటి శక్తివంతమైన సంస్థ లభించడం పట్ల సంతోషంగా ఉన్నాము. వాల్యూ రిటైల్‌లో గణనీయమైన ఉత్పత్తి సామర్థ్యంలతో విస్తరించతగిన  ఫార్మాట్‌ను సృష్టించినప్పటికీ మా ఆరు బ్రాండ్లపై దృష్టి కేంద్రీకరించడంలో భాగంగా ఈ వ్యాపారం నుంచి మేము వైదొలుగుతున్నాం..’’ అని అన్నారు. ఈ లావాదేవీకి ఫైనాన్షియల్‌ ఎడ్వైజర్‌గా మ్యాట్‌ క్యాపిటల్‌ వ్యవహరించగా, సరాఫ్‌ అండ్‌ పార్టనర్స్‌ దీనికి లీగల్‌ ఎడ్వైజర్‌గా వ్యవహరించింది.