ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 31 అక్టోబరు 2023 (19:47 IST)

ఏపీ, కర్ణాటకలలో చిన్నతరహా గృహ రుణాలను అందించేందుకు రూ.150 కోట్లు సమీకరించిన వృద్ధి హోమ్ ఫైనాన్స్

loan cashback
బిఎఫ్‌ఎస్‌ఐ- ఎఫ్‌ఎంసిజి రంగాలలో 25 ఏళ్లకు పైగా విశేష అనుభవం కలిగిన శ్రీ సుంకు రామ్ నరేష్ ఈ కంపెనీ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటవ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. సహ వ్యవస్థాపకులుగా శ్రీ సందీప్ అరోరా (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్), శ్రీ సునీల్ మెహతా (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్) బెంగళూరు కేంద్రంగా వృద్ధి హోమ్ ఫైనాన్స్‌ను 2022లో ప్రారంభించారు.
 
చిన్నతరహా గృహ రుణాలను అందించేందుకు, వ్యాపారాన్ని మరింతగా పెంచుకునేందుకు సిరీస్ ఏలో భాగంగా ఎలివేషన్ క్యాపిటల్ నుండి రూ.150 కోట్లను సమీకరించినట్లు ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ వృద్ధి హోమ్ పైనాన్స్ ప్రకటించింది. ఈ సేకరించిన నిధులతో వ్యాపారాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించడం, సాంకేతికతను బలోపేతం చేయడం, రాబోయే బ్రాంచ్‌ల్లో మౌలిక వసతులు, ఉద్యోగ కల్పన కోసం ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, కర్నూలు, నెల్లూరు, హిందూపురం, మదనపల్లె, అనంతపురం, ధర్మవరం మరియు కర్నాటకలోని బెంగళూరు, హోసకోట్, నేలమంగళ, చందాపుర, కెంగేరి, బంగారుపేట, చిక్కబల్లాపుర, మైసూర్, మద్దూర్, తుమకూరు, బీదర్, హుబ్లీ, బెలగావి, గుల్బర్గా పట్టణాల్లో ఇరవై శాఖలను వృద్ధి హోమ్ ఫైనాన్స్ కంపెనీ ప్రారంభించింది.
 
'ఏడాది సమయంలోనే వృద్ధి హోమ్ ఫైనాన్స్ వందలాది మంది వినియోగదారులకు సగటున రూ. 8-10 లక్షల పరిమాణంతో గృహ రుణాలను పొందడంలో సహాయం చేసింది. సహ వ్యవస్థాపకులు మరియు వ్యవస్థాపక బృందం మధ్య 75 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న వృద్ధి హోమ్ ఫైనాన్స్... భారతదేశంలోని చిన్న, మధ్య తరహా నగరాల్లో వేతనాలు మరియు స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు సేవలందిస్తూ, వారికి గృహ రుణాలను అందిస్తూ సరికొత్త అవకాశాలను రూపొందించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
 
ఈ సందర్భంగా వృద్ధి హోమ్ ఫైనాన్స్ వ్యవస్థాపకుడు, ఎండీ- సీ.ఈ.ఓ. శ్రీ సుంకు రామ్ నరేష్ మాట్లాడుతూ, “ఎలివేషన్ క్యాపిటల్‌తో మా గౌరవప్రదమైన భాగస్వామ్యాన్ని గుర్తించి, మాకు మద్దతును అందించిన వారందరికి మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. ఈ గణనీయమైన పెట్టుబడి పెరుగుదలతో, గృహ పరిష్కారాలను అందించే మా మిషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాము. చిన్న పట్టణాలు- గ్రామీణ ప్రాంతాలలో చిన్న తరహా వేతన దారులకు, స్వయం ఉపాధిదారులకు రుణాలు పొందడం కష్టాంగా ఉంటుంది, వారి సొంతింటి కళను నిజం చేయటానికి వృద్ధి కట్టుబడి ఉంది. మేము సాగిస్తున్న మా ప్రయాణం చాలా ఆశాజనకంగా కొనసాగుతోంది. అంతేకాకుండా ఈ విభాగానికి సరళమైన, సురక్షితమైన  గృహ రుణాలను అందించేందుకు అంకితభావంతో ఉన్నామని తెలిపారు.