గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 18 అక్టోబరు 2021 (22:40 IST)

జెఈఈ అడ్వాన్స్‌డ్‌ 2021 ఫలితాలలో టాప్‌ 500లో ఇద్దరు ఆకాష్‌ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు

ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌, హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు అత్యంత ప్రతిష్టాత్మకమైన జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌(జెఈఈ) అడ్వాన్స్‌డ్‌ 2021 పరీక్షాఫలితాలలో టాప్‌ 500లో ర్యాంకులను సాధించడం ద్వారా ఇనిస్టిట్యూట్‌కు గర్వకారణంగా నిలిచారు. టాప్‌ 500లో ర్యాంకులను సాధించిన విద్యార్ధులలో గౌతమ్‌సింగ్‌, ఆల్‌ ఇండియా ర్యాంక్‌ 191 సాధించగా, శ్రీ నికేతన్‌ జోషి 491వ ర్యాంక్‌ సాధించాడు.
 
ఈ ఇరువురు విద్యార్థులు ఐఐటీ జెఈఈలో ర్యాంకులను సాధించడం కోసం ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌లో రెండు సంవత్సరాల క్లాస్‌రూమ్‌ ప్రోగ్రామ్‌లో చేరారు. కాన్సెప్ట్‌లను అర్థం చేసుకోవడంతో పాటుగా తమ అభ్యాస షెడ్యూల్స్‌కు పూర్తిగా కట్టుబడి ఉండటం ద్వారా ఇప్పుడు అత్యున్నత ర్యాంక్‌లను సాధించగలిగామని వారు వెల్లడించారు. ఈ ఇరువురూ మాట్లాడుతూ  ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌ తమకు ఎంతగానో సహాయపడింది. ఇనిస్టిట్యూట్‌ అందించిన కంటెంట్‌ మరియు కోచింగ్‌ కారణంగా అతి తక్కువ సమయంలోనే తాము సబ్జెక్ట్‌ను బాగా అర్థం చేసుకోగలిగామన్నారు.
 
విద్యార్థులను అభినందించిన ఆకాష్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎస్‌ఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ ఆకాష్‌ చౌదరి మాట్లాడుతూ, ‘‘అసాధారణ విజయం సాధించిన మా విద్యార్థులను అభినందిస్తున్నాము. మొత్తంమ్మీద 1,41,699 మందివిద్యార్థులు 2021 సంవత్సరం జెఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు హాజరుకాగా 41,862 మంది మాత్రమే అర్హత సాధించారు. వారు సాధించిన విజయం, వారి కష్టం, అంకిత భావం గురించి మాత్రమే కాదు వారి తల్లిదండ్రుల ప్రోత్సాహం గురించి కూడా ఎంతో చెబుతుంది. ఈ ఇరువురు విద్యార్థులు, భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని  ఆకాంక్షిస్తున్నాము’’ అని అన్నారు.
 
ఆయనే మాట్లాడుతూ ‘‘విద్యాసంవత్సరంపై మహమ్మారి తీవ్ర ప్రభావమే చూపింది. మేము విద్యార్థుల ప్రయోజనార్ధం స్టడీ మెటీరియల్స్‌, క్వశ్చన్‌ బ్యాంక్స్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాం. మేము విద్యార్థుల ప్రయోజనార్థం పలు స్ఫూర్తిదాయక సదస్సులు, సెమినార్లు నిర్వహించాం. మా ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభించడంతో పాటుగా  అగ్రశ్రేణి ఐఐటీ, ఎన్‌ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో  చదివే అవకాశం మా విద్యార్ధులకు లభించింది’’ అని అన్నారు.