సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 28 జులై 2022 (23:13 IST)

మెటావర్స్‌లో ఉపాధి అవకాశాలను అందించేందుకు ముందడుగు వేసిన అజ్నాలెన్స్

co-founders
మెటావర్స్‌లో అంతర్జాతీయంగా వేలాది ఉద్యోగావకాశాలు స్వాగతం పలుకుతున్నా యి. వివిధ నివేదికల ప్రకారం, భారతదేశంలోనే ఇప్పుడు 55,000 ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నా, పరిశ్రమ అవసరాలకు, నిపుణులైన సిబ్బందికి మధ్య భారీగా అంతరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ పరిశ్రమల్లో కంపెనీలు యావత్ ఎకోసిస్టమ్‌ను విప్లవీకరించేందుకు మెటావర్స్‌ను ఉపయోగిస్తున్నాయి. మెడికల్, ఇంజినీరింగ్, తయారీ రంగం వంటివెన్నో ఇందులో ఉన్నాయి. దుబాయ్ ఆవిష్కరించిన నూతన మెటావర్స్ స్ట్రాటజీ ప్రకారం, 2030 నాటికి 42,000 వర్చువల్ ఉద్యోగాలకు అండగా నిలవాలన్నది మరియు తన ఆర్థిక వ్యవస్థకు 4 బిలియన్ డాలర్లను జోడించాలన్నది దాని లక్ష్యంగా ఉంది.
 
భారతదేశంలో విద్యావ్యవస్థ తాజా పరిణామాలు, కొత్త కెరీర్ ఆప్షన్లకు, మెటావర్స్ లో పే స్కేల్ కు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఎక్స్ఆర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కంపెనీ అయిన అజ్నాలెన్స్ ఈ అంతరాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేపట్టింది. అందులో భాగంగా, మెటావర్స్ ఎడ్యుకేషన్లో, ఎంప్లాయిమెంట్ విభా గంలో అగ్రగామిగా ఉండేలా, తన ఫ్లాగ్ షిప్ ఆఫరింగ్ అయిన అజ్నా క్రియేటర్స్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించింది. భారతదేశపు మొట్టమొదటి సర్టిఫైడ్ మెటావర్స్ క్రియేషన్ ప్రోగ్రామ్‌గా ఇది ఎక్స్ఆర్, డిజిటల్ ట్విన్, బ్లాక్ చెయిన్ ఇంకా మరెన్నో అంశాలకు సంబంధించి మెటావర్స్ కీలక అంశాలపై సమగ్ర అభ్యసనాన్ని అందించనుంది. ఈ ప్రోగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా మెటావర్స్‌లో అత్యధిక జీతాలు పొందే అవకాశాలకు భారతీయు యువతను సన్నద్ధం చేయనుంది.
 
6 నెలల ప్రోగ్రామ్ ను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులు ఏఐసిటిఇ ఇంటర్న్షిప్ సర్టిఫికెట్ పొందగలుగుతారు. దాంతోపాటుగా ఆ విద్యార్థులు ప్లేస్‌మెంట్స్ పొందడంలో లేదా ఎక్స్ఆర్ రంగంలో వారు తమ సొంత స్టార్టప్ నిర్మించుకోవడంలో అజ్నాలెన్స్ అండగా నిలువనుంది. మొదటి బ్యాచ్ 2022 ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది.
 
అజ్నాలెన్స్ మాడ్యూల్ విశిష్టంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే వృద్ధి చెందుతున్న ఈ పరిశ్రమలో ప్రొఫెషనల్స్‌ను ఉద్యోగాలకు సిద్ధం చేయడం ద్వారా వారికి సాధికారికత అందించనుంది. 3డి అసెట్స్, కాంపొనెంట్స్‌ను నిర్మించడం, ఇంటిగ్రేట్ చేయడం మొదలుకొని సంపూర్ణ, ఇమెర్సివ్ మెటావర్స్ అనుభూతిని రూపొందించడం దాకా ఎన్నో అంశాలు ఇందులో ఉంటాయి. పరిశ్రమలో కీలకంగా ఉంటున్న వారి నుంచి నేర్చుకునే, ట్రైనింగ్ అవకాశాలను పొందే అవకాశాన్ని ఇది అందిస్తుంది. పరిశ్రమలో ఉద్యోగావకాశాలు పొందడంలో అండగా ఉంటుంది.
 
ఈ సందర్భంగా అజ్నాలెన్స్ సీటీఓ అభిషేక్ తోమర్ మాట్లాడుతూ, ‘‘తక్షణ భవిష్యత్ కెరీర్ మెటావర్స్ క్రియేషన్. ఈ రంగంలో తమ కెరీర్లను నిర్మించుకునేందుకు యువత సిద్ధం కావాలి. భారతదేశంలో యువత సంఖ్య అధికంగా ఉంది. ఒక దేశంగా మనం సాంకేతిక ప్రపంచంలో గతంలో చోటుచేసుకున్న విప్లవాత్మకతలను చేజా ర్చుకున్నాం. నేడు మెటావర్స్ ప్రపంచంలో భారతదేశాన్ని దృఢంగా నిలబెట్టడంపై, ఆ అవకాశాలను ఇక్కడి యువతకు అందించడంపై అజ్నాలెన్స్ లో మేం దృష్టి పెట్టాం. తగినంత నాలెడ్జ్ మరియు అధునాతన సాంకేతిక తలతో భవిష్యత్ సన్నద్ధక యువతను రూపొందించేందుకు అవసరమైన వాటిని మేం కలిగిఉన్నాం. ఏఆర్, విఆర్, ఎంఆర్ స్పేస్‌లో నిరూపిత నైపుణ్యాలను కలిగిఉన్నాం. ఏఐసీటీఈ ఆమోదిత ఇంటర్న్షిప్ సర్టిఫికెట్ అనేది యువత నైపుణ్యాలను మరింత పెంచుతుంది. రేపటి ఉద్యోగాలకు వారిని సిద్ధం చేస్తుంది’’ అని అన్నారు.
 
‘‘దీర్ఘకాలంగా ఉన్న నైపుణ్యాల అంతరాన్ని ఈ ప్రోగ్రామ్ భర్తీ చేయగలదని, సాంకేతికత ప్రపంచంలో అమితంగా అందరినీ ఆకర్షిస్తున్న రంగంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాన్ని అందించగలదని మేం విశ్వసిస్తున్నాం’’ అని ఆయన అన్నారు. అత్యుత్తమ టూల్స్‌ను అందిచడం ద్వారా అజ్నా క్రియేటర్ ప్రోగ్రామ్ ప్రగతిశీలక అభ్యసనానికి పునాది వేయనుంది.