1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 అక్టోబరు 2021 (11:46 IST)

ఈరోజే NEET PG & ICSI CS రిజల్ట్స్...

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో సీఎస్ ప్రొఫెషనల్, సీఎస్ ఎగ్జిక్యూటివ్ ఫలితాలను అందుబాటులో ఉంటాయి. పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చు. 
 
విద్యార్థులు తమ గ్రూపు, రూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబరు వివరాలను నమోదుచేసి ఫలితాలను చూసుకోవచ్చు. అయితే షెడ్యూల్‌ ప్రకారం.. ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌ ఫలితాలు విడుదల కాగా, ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌ ఫలితాలు మధ్యాహ్నం 2 గంటలకు విడుదల కానున్నాయి. అలాగే ఫౌండేషన్‌ ప్రోగ్రామ్‌ ఫలితాలు సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్నాయి.
 
కాగా, సీఎస్‌ ఫౌండేషన్‌ ప్రోగ్రామ్‌ పరీక్ష ఆగస్టు 13, 14వ తేదీల్లో నిర్వహించారు. అలాగే ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌, ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌ కోసం సీఎస్‌ పరీక్ష ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు జరిగింది. అయితే ప్రొఫెషనల్‌ కోర్సు ఫలితాలు విడుదలయ్యాయి. 
 
అయితే ఫౌండేషన్ మరియు ఎగ్జిక్యూటివ్ విద్యార్థులు డిజిటల్ మార్క్ స్టేట్‌మెంట్‌లను మాత్రమే చూసుకుంటారని ఇనిస్టిట్యూట్ తెలిపింది. ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ కోసం, రిజల్ట్-కమ్-మార్క్ స్టేట్‌మెంట్‌ల హార్డ్ కాపీలు విద్యార్థుల రిజిస్టర్డ్ అడ్రస్‌లకు పంపనున్నట్లు వెల్లడించింది.