శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (12:28 IST)

CRPF పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: అక్టోబర్ 27న ఇంటర్వ్యూ

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఈ పోస్టుల నియామకం కోసం అక్టోబర్ 27న జరిగే ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.

అయితే ఇంటర్వ్యూ కి ఎటెండ్ అవ్వాలనుకునే వాళ్ళు ముందుగా తమ దరఖాస్తును నోటిఫికేషన్‌లో పేర్కొన్న చిరునామాకు అక్టోబర్ 25 లోపు నిర్దేశిత ఫార్మాట్‌లో పంపాలి.
 
ఈ ప్రక్రియ ద్వారా 1 మేసన్ పోస్ట్ , 1 సీవర్ మ్యాన్ పోస్ట్ నియామకం చేయబడుతుంది.అభ్యర్థులను రోజువారీ వేతనాలపై , పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన నియమిస్తారు.

ఇది ఇలా ఉంటే అభ్యర్థి ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అలానే అనుభవం తప్పక ఉండాలి. అలానే అభ్యర్థి కనీస వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు ఉండాలి.