శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 6 అక్టోబరు 2021 (16:26 IST)

విఐపిలు ఆ ఒక్కరోజు తిరుమల రావద్దండి, ఎందుకంటే..?

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటి సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నాయి. అంకురార్పణతో బ్రహ్మోత్సవాలను టిటిడి ప్రారంభించనుంది. తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో పలు సేవలను టిటిడి రద్దు చేస్తోంది. అంతే కాదు ఏకాంతంగానే బ్రహ్మోత్సవాలను నిర్వహించనుంది. 
 
అయితే ఈనెల 15వ తేదీన తిరుమలలో విఐపి బ్రేక్ దర్సనాలను రద్దు చేసింది టిటిడి. అక్టోబర్ 14వ తేదీన విఐపి బ్రేక్ దర్సనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అక్టోబర్ 15వ తేదీ చక్రస్నానం కారనంగా ఆలయంలో ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
 
ఈ కారణంగా గురువారం, అక్టోబర్ 15వ తేదీన విఐపి బ్రేక్ దర్సనాలను టిటిడి రద్దు చేసింది. అక్టోబర్ 14వ తేదీన విఐపి బ్రేక్ దర్సనాలకు ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేసింది. కాబట్టి విఐపిలు, భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టిటిడి విజ్ఞ చేస్తోంది.
 
ఇప్పటికే టిటిడి బ్రహ్మోత్సవాలకు ముందు విఐపి బ్రేక్ ఒకరోజు పాటు రద్దు చేసింది. ఈనెల 4వ తేదీన బ్రహ్మోత్సవాలకు సంబంధించి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతున్న నేపథ్యంలో టిటిడి బ్రేక్ దర్సనాలను రద్దు చేసింది. బ్రహ్మోత్సవాల సమయంలో బ్రేక్ దర్సనాల రద్దు మామూలుగా జరుగుతోంది.