శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (13:32 IST)

భారత్ - ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ వాయిదా

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన చివరి టెస్ట్ మ్యాచ్‌ను వాయిదావేశారు. ఈ మేరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇప్పటికే జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్‍‌లలో భారత్ రెండు, ఇంగ్లండ్ ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 
 
భార‌త క్రికెట్ జ‌ట్టు శిక్ష‌ణ సిబ్బందికి క‌రోనా సోక‌డంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మ్యాచ్‌ను వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే ఆట‌గాళ్ల‌తో పాటు జ‌ట్టు సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. 
 
ఈ మొత్తం క‌రోనా ప‌రీక్ష‌ల ఫ‌లితాలు వ‌చ్చాకే మ్యాచ్‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్ల‌డించింది. ఆ ప్రకారంగానే ఈ మ్యాచ్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు. ముఖ్యంగా, ఈ పరీక్షల్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి నెగెటివ్ ఫలితం వచ్చిన విషయం తెల్సిందే.