ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 సెప్టెంబరు 2021 (20:54 IST)

ఆయిల్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

ఆయిల్ ఇండియా లిమిటెడ్ తాజాగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లో నిర్వహిస్తున్న పనుల కోసం పలు పోస్టుల్ని ఆయిల్ ఇండియా లిమిటెడ్ భర్తీ చేస్తోంది. దీనిలో మొత్తం 535 ఖాళీలు వున్నాయి. అస్సాం లోని దులియాజన్‌లో గల ఫీల్డ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ పోస్టులున్నాయి. ఇందులో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్ లాంటి పోస్టులు ఉన్నాయి. 
 
ఇక విద్యార్హత విషయానికి వస్తే.. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పోస్టులను బట్టి టెన్త్‌, ఇంటర్మీడియట్‌, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక వయస్సు అయితే.. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 18 నుంచి 30 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 18 నుంచి 33 ఏళ్లు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 18 నుంచి 35 ఏళ్లు ఉండాలి. అలాగే పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. 
 
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరితేది సెప్టెంబర్ 23, 2021. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. పోస్టులను బట్టి శాలరీ రూ.26,600 - 90,000 వరకూ ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలను https://www.oil-india.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.