మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 ఆగస్టు 2021 (18:01 IST)

తెలంగాణలో ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం.. సెప్టెంబర్ 9 వరకు..

తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఎంసెట్‌ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. నేటి నుంచి (ఆగస్టు 30) సెప్టెంబర్‌ 9 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ చేసుకున్న విద్యార్థులకు వచ్చే నెల 4 నుంచి 11 వరకు ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
 
సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు సెప్టెంబర్ 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. సెప్టెంబర్ 15వ తేదీన మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు వచ్చే నెల 15 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. మొదటి విడత సీట్ల కేటాయింపును సెప్టెంబర్‌ 15న నిర్వహిస్తారు.