శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 11 డిశెంబరు 2019 (19:13 IST)

ఇస్రోలో 45 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం: జీతం రూ.44,900 నుంచి రూ.1,42,400

ఇస్రోలో 45 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. టెక్నీషియన్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ తదితర పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ పాసైనవారి కోసం కూడా కొన్ని పోస్టులను కేటాయించారు. 
 
నెల జీతం రూ.44,900 నుంచి రూ.1,42,400 మధ్య వుంటుంది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునేవారు వేర్వేరుగా అప్లై చేయాలి. మరిన్ని వివరాలకు ఇస్రో అధికారిక వెబ్ సైట్ చూడవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు ఆఖరి తేదీ 13-12-2019