శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By
Last Updated : శనివారం, 22 డిశెంబరు 2018 (11:53 IST)

బోధనలోని మెళకువలు నేర్పించిన నారాయణ ఫెస్ట్ 2018

చెన్నై నగరంలో నిర్వహించిన 'నారాయణ ఫెస్ట్ 2018' శుక్రవారం అట్టహాసంగా జరిగింది. చెన్నై నగర శివారు ప్రాంతమైన మదురవాయల్‌లోని నారాయణ ఈ-టెక్నో పాఠశాలలో నిర్వహించిన ఈ వేడుకల్లో నారాయణ విద్యా సంస్థల చీఫ్ డైరెక్టర్ సింధూర, నిర్వహణ డైరెక్టర్ పవన్ చంపా, డీన్ లక్ష్మీలు ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నగరంలో దాదాపు 20 పాఠశాలలు నడుస్తున్నాయని చెప్పారు. విద్యార్థులకు మెరుగైన, ఉన్నతమైన విద్యను అందించాలన్న ఏకైక లక్ష్యంతో చెన్నై నగరంలో కూడా నారాయణ విద్యా సంస్థ పాఠశాలలను ప్రారంభించినట్టు వెల్లడించారు.
 
ఇందుకోసం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నట్టు వారు గుర్తుచేశారు. గత రెండు రోజుల పాటు జరిగిన 'ఫెస్ట్2018' కార్యక్రమంలో ఉపాధ్యాయులకు సృజనాత్మకతో కూడిన బోధన, సులభంగా బోధించే విద్యా విధానం, మెళకువలను నేర్పించారు. కాగా, నగరంలోని 20 నారాయణ పాఠాశాలలకు చెందిన దాదాపు 1500 మంది అధ్యాపకులు, బోధనా సిబ్బంది ఈ ఫెస్ట్‌లో పాల్గొని సందడి చేయడమే కాకుండా వివిధ రకాల మెళకువులను నేర్చుకున్నారు.
 
ఈ కార్యక్రమం ముంగింపులో "స్టార్ ఫెస్ట్" పేరుతో వివిధ రకాల సాంస్కృతి కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇందులో అన్నిరకాల ఆటలు, పాటల పోటీలను నిర్వహించగా, ఇందులో ఉపాధ్యాయులు కూడా పాల్గొని తమలోని ప్రతిభానైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.