బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 23 జులై 2022 (23:14 IST)

ఐసీఎస్‌ఈ బోర్డు పరీక్షలలో 99% స్కోర్‌ చేసిన హైదరాబాద్‌లోని ఆకాష్‌ బైజూస్‌ విద్యార్థి శ్రీవత్స పులిపాటి

Sreevatsa Pulipati
టెస్ట్‌ ప్రిపరేటరీ సేవలలో జాతీయ అగ్రగామి ఆకాష్‌ బైజూస్‌ సంస్ధ హైదరాబాద్‌ శాఖ విద్యార్ధి శ్రీవత్స పులిపాటి, ఇనిస్టిట్యూట్‌కు గర్వకారణంగా నిలుస్తూ ఇండియన్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (ఐసీఎస్‌ఈ) లో 99.00% స్కోర్‌ చేశాడు. ఐసీఎస్‌ఈ బోర్డు పరీక్షలలో పదవ తరగతిలో 500 మార్కులకు గానూ 495 మార్కులను శ్రీవత్స పులిపాటి సాధించాడు. ఈ పరీక్షా ఫలితాలను ఇటీవలనే ప్రకటించారు.

 
అద్భుతమైన ఫలితాలను గురించి ఆకాష్‌ బైజూస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ ఆకాష్‌ చౌదరి మాట్లాడుతూ, ‘‘ఐసీఎస్‌ఈ బోర్డు పరీక్షలో శ్రీవత్స పులిపాటి సాధించిన అపూర్వమైన విజయం పట్ల సంతోషంగా ఉన్నాము. మా స్టడీ మెటీరియల్స్‌ను అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్దాము. వీటివల్ల విద్యార్థులు బోధనాంశాలలో  ప్రాధమికాంశాలను సైతం క్షుణ్ణంగా అర్ధం చేసుకుని పరీక్షలలో ఆకర్షణీయమైన మార్కులను సాధించగలిగారు. మొత్తంమ్మీద అభ్యాస సామర్ధ్యం, విద్యా ప్రదర్శన  మెరుగుపరిచేందుకు ఆకాష్‌ బైజూస్‌ నిరంతరం ప్రయత్నాలను చేస్తూనే ఉంటుంది. భవిష్యత్‌లో అతను మరిన్ని  విజయాలను సాధించాలని నేను ఆకాంక్షిస్తున్నాను’’ అని అన్నారు.

 
ఐసీఎస్‌ఈ క్లాస్‌ టెన్‌లో మొత్తంమ్మీద 231,063 మంది విద్యార్థులు హాజరుకాగా 99.97% మంది పరీక్షలలో పాస్‌ అయ్యారు. విద్యాపరంగా అపూర్వ విజయం సాధించాలని ఆరాటపడే విద్యార్థులకు సహాయపడటాన్ని ఆకాష్‌+బైజూస్‌ లక్ష్యంగా చేసుకుంది. దీనిలో కరిక్యులమ్‌ మరియు కంటెంట్‌ డెవలప్‌మెంట్‌, ఫ్యాకల్టీ శిక్షణ, పర్యవేక్షణ కోసం కేంద్రీకృత అంతర్గత ప్రక్రియ ఉంది. దీనికి నేషనల్‌ అకడమిక్‌ బృందం నేతృత్వం వహిస్తుంది. గత కొద్ది సంవత్సరాలుగా ఆకాష్‌+బైజూస్‌ విద్యార్థులు పలు మెడికల్‌, ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలతో పాటుగా ఎన్‌టీఎస్‌ఈ, కెవీపీవై, ఒలింపియాడ్స్‌ లాంటి పోటీపరీక్షలలో సైతం ఎంపిక పరంగా రికార్డులు సృష్టించారు.