మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్

నేడు #JEEAdvanced2020Exam - రెండు షిప్టుల్లో

jee exam
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష అడ్వాన్స్‌డ్ 2020 (JEE Advanced 2020 Exam) ఆదివారం దేశ వ్యాప్తంగా జరుగనుంది. దేశ వ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లో ఈ పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. 
 
మొదటి షిప్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటకు, రెండో షిఫ్టు 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగనుంది. ఈ విధానంలో పరీక్ష రాసేందుకు పరీక్షా హాలుకు విద్యార్థులు హాజరయ్యారు. 
 
అయితే, ఈ పరీక్ష కోసం హాజరయ్యే విద్యార్థులకు అనేక నిబంధనల28ను విధించారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు విధిగా తమ వెంట అడ్మిట్ కార్డును తీసుకుని వెళ్లాల్సివుటుంది. ఈ కార్డు లేకుంటే మాత్రం పరీక్షా హాలులోకి అనుమతించరు. 
 
అలాగే, అభ్యర్థులు పెన్ను, పెన్సిల్‌తో పాటు పారదర్శకంగా ఉండే వాటర బాటిళ్లను మాత్రమే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే, పరీక్షకు హాజరైన అభ్యర్థులను శరీర ఉష్ణోగ్రతను పరీక్షించిన తర్వాతే పరీక్షా హాలులోకి అనుమతించారు. పరీక్ష ముగిసిన తర్వాత జేఈఈ అడ్మిట్ కార్డుతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్‌ను పరీక్షా ఇన్విజిలేటర్‌కు అందజేయాల్సివుంటుంది.