శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 21 ఆగస్టు 2024 (22:51 IST)

ఏడాదికి రూ.12 లక్షల శాలరీ ప్యాకేజీతో 2 వేల మంది యువతకి ఉద్యోగాలు

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి పొందిన గ్రూప్‌గా, 2 బిలియన్ డాలర్ల సంస్థకు ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించిన సంస్థ ట్రైడెంట్ గ్రూప్. అలాంటి సంస్థ ఇప్పుడు తక్షశిల అనే కార్యక్రమాన్ని సగర్వంగా ప్రకటించింది. ఇది ప్రత్యేకంగా రిక్రూట్మెంట్, ట్రైనింగ్ కోసం ఉద్దేశించబడిన కార్యక్రమం. దీనిద్వారా 2000 మంది కొత్త ఉద్యోగుల్ని తీసుకుని వారికి తగిన శిక్షణ అందించి ఉపాధి కూడా చూపేంచే అద్భుతమైన కార్యక్రమమే తక్షశిల. 2000 మంది కొత్త  ఉద్యోగుల్ని ప్రధానంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి ఎంపిక చేస్తారు. దీనిద్వారా ఆయా ప్రాంతాల్లో ఉద్యోగఅవకాశాలు కల్పించినట్లు అవుతుంది, అలాగే అక్కడి యువతలో నైపుణ్యాలు కూడా మరింతగా అభివృద్ధి చెందుతాయి.
 
తక్షశిల కార్యక్రమం ద్వారా ప్రధానంగా ఐటీఐ, డిప్లొమాలు, 10+2 విద్యను అభ్యసించిన యువతకు ఒక అద్భుతమైనన వేదికను అందించడమే లక్ష్యం. దీనిద్వారా విద్యాపరమైన అడ్డంకులను విచ్ఛిన్నం చేయడం ద్వారా, తక్షశిల నిరంతర అభివృద్ధి, వ్యక్తిగత అభివృద్ధి సంస్కృతిని పెంపొందిస్తుంది. అంతేకాకుండా, యువత సంపాదించడానికి, నేర్చుకోవడానికి, ఎదగడానికి తలుపులు తెరుస్తుంది. ఇలా నేర్చుకుని శిక్షణ పొందిన యువతకు వేతనం ఏడాదికి రూ. 12 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రాథమిక విద్య నేపథ్యంతో ప్రత్యక్ష, జీవనోపాధి అవకాశాన్ని కల్పిస్తుంది, ఇది కార్పొరేట్ భారతదేశంలో ప్రత్యేకమైనది.
 
ఈ సందర్భంగా ట్రైడెంట్ గ్రూప్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ రాజిందర్ గుప్తా గారు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... "ఇవాళ మా ఫ్లాగ్‌షిప్ కార్యక్రమం అయినటువంటి తక్షశిల ప్రారంభంతో అభివృద్ధి- సాధికారత యొక్క కొత్త అధ్యాయాన్ని సరికొత్తగా ప్రారంభించడం చాలా ముఖ్యమైన సందర్భాన్ని సూచిస్తుంది. ఈ కార్యక్రమం చాలా అంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సామాజిక అభివృద్ధి, ఆర్థిక అభ్యున్నతి, వైవిధ్యం, దేశ నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. మహిళలకు (50% సీట్లు రిజర్వు చేయబడినవి), గ్రామీణ- ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలు, రక్షణ సేవా అనుభవజ్ఞులు- జాతీయ స్థాయి క్రీడాకారులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
 
“ప్రతి ఒక్కరూ తమ పరిధులను విస్తరించుకోవాలని మేం ఎప్పటికప్పుడు కోరుకుంటాం. అంతేకాకుండా దేశ అభివృద్ధిలో నిజమైన భాగస్వాములు కావడానికి ఒక వేదికను అందించడం ద్వారా తక్షశిల మా 'అవకాశాల అన్‌లిమిటెడ్' తత్వశాస్త్రాన్ని ప్రతిబింబిస్తుంది. కలిసి ఎదగాలనే ప్రేమతో ప్రతి ఒక్కరూ నేర్చుకునే వాతావరణాన్ని పెంపొందించడంలో మా అచంచలమైన నిబద్ధతకు ఇది నిదర్శనం. మేము తక్షశిల 2024ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది ” అని అన్నారు ఆయన.
 
తక్షశిల ప్రారంభం నుంచి ఇప్పటివరకు సాధారణ జీవిత నేపథ్యం నుంచి వచ్చిన 20,000 మందికి పైగా యువత ఉపాధిని పొందారు. ఇందులో పాల్గొన్న వారు నిర్మాణాత్మక క్లాస్ రూం శిక్షణ, అనుభవం, మెంటర్‌షిప్, నిరంతర నైపుణ్యాన్ని కలిగి ఉంటారు, వారు తమ కెరీర్‌లో రాణించడానికి సిద్ధంగా ఉన్న తర్వాతే బయటకు వస్తారు. ఈ పూర్వ విద్యార్థులలో చాలామంది ప్రభావవంతమైన నాయకులు, జాతీయంగా- ప్రపంచవ్యాప్తం నిపుణులు, వ్యవస్థాపకులు, పౌర సేవకులు, విద్యావేత్తలు- వ్యాపారాలుగా మారారు.
 
తక్షశిల 2024 నియామక డ్రైవ్ ని డిజిటల్ మీడియా ప్రచారం, క్యాంపస్ ఎంగేజ్‌మెంట్‌లు, గ్రామీణ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌ల ద్వారా నిర్వహిస్తారు. ఈ డ్రైవ్ ద్వారా 50,000 మంది దరఖాస్తుదారులను ఆహ్వానిస్తోంది.