శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 డిశెంబరు 2022 (09:05 IST)

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త - గ్రూపు-4 నోటిఫికేషన్ రిలీజ్

tspsc
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూపు-4 కింద 9168 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నిజానికి తెలంగాణాలో 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని దశల వారీగా భర్తీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజాగా గ్రూపు-4 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీచేసింది. ఆయన శాఖల్లో ఖాళీగా ఉన్న 9168 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
 
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా జారీ అయిన ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 23వ తేదీ జనవరి 12వ తేదీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్‌లో పరీక్షల తేదీలను వెల్లడించని అధికారులు పరీక్షలు వచ్చే యేడాది ఏప్రిల్ లేదా మే నెలల్లో నిర్వహించే అవకాశం ఉందని వారు తెలిపారు.