శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 1 డిశెంబరు 2020 (15:57 IST)

పాఠశాల విద్యార్థుల కోసం గో-ఫర్‌ గోల్డ్‌ కార్యక్రమాన్ని ప్రకటించిన యుఎన్‌ అకాడమీ

భారతదేశంలో సుప్రసిద్ధ అభ్యాస వేదిక యుఎన్‌ అకాడమీ ఇప్పుడు ఇంటర్నేషనల్‌ ఒలింపియాడ్‌ ఇన్‌ ఇన్‌ఫార్మిటిక్స్‌ (ఐఓఐ) 2021లో పాల్గొంటున్న భారతీయ పాఠశాల విద్యార్థుల కోసం గో-ఫర్‌ గోల్డ్‌ కార్యక్రమం ప్రారంభించింది. పాఠశాల విద్యార్థుల కోసం ప్రోగ్రామింగ్‌ మరియు ఇన్‌ఫార్మిటిక్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన యునెస్కో గుర్తించిన ఒలింపియాడ్‌ ఐఓఐ.
 
గో-ఫర్‌ గోల్డ్‌ కార్యక్రమాన్ని 2013వ సంవత్సరంలో కోడ్‌ చెఫ్‌ ప్రారంభించారు. తద్వారా ఐఓఐ పోటీలో ప్రతిభ మరియు శిక్షణ కోరుకునే పోటీదారుల నడుమ ఖాళీని పూరించనుంది. జూన్‌ 2020లో కోడ్‌ చెఫ్‌ కస్టోడియన్‌షిప్‌గా యుఎన్‌ అకాడమీ బాధ్యతలు తీసుకుంది. ఈ గో ఫర్‌ గోల్డ్‌ కార్యక్రమంలో భాగంగా, యుఎన్‌ అకాడమీ 15 లక్షల రూపాయల నగదు బహుమతిని అందించనుంది. దీనితో పాటుగా ల్యాప్‌టాప్‌ మరియు ఇతర బహుమతులను ఐఓఐ 2021 వద్ద బంగారు పతకం అందుకున్న భారతీయ విద్యార్థులకు అందించనుంది.
 
అనూప్‌ కల్బాలియా, కోడ్‌ చెఫ్‌ బిజినెస్‌ హెడ్‌-యుఎన్‌ అకాడమీ మాట్లాడుతూ, ‘‘కోడ్‌ చెఫ్‌ యొక్క గో–ఫర్‌ గోల్డ్‌ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని యుఎన్‌ అకాడమీ తీసుకున్న నిర్ణయం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఓఐ వద్ద భారతీయ విద్యార్థులు తమ ప్రతిభను వెల్లడి చేయడమే దీని లక్ష్యం.
 
యుఎన్‌ అకాడమీ మా వైపు రావడంతో, మేము మా ప్రయత్నాలను వేగవంతం చేయడంతో పాటుగా దేశవ్యాప్తంగా ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ మరియు ఇన్‌ఫార్మిటిక్స్‌ గురించి పాఠశాల కరిక్యులమ్‌లో భాగం చేసేందుకు తగిన అవగాహన కల్పించడం  లక్ష్యంగా చేసుకున్నాం. వాస్తవమే అయినప్పటికీ, ప్రోగ్రామింగ్‌ను కంప్యూటర్‌ లేకుండా కూడా  అభ్యసించవచ్చని చాలా మందికి తెలియదు. అనుసంధానిత మార్గాలైనటువంటి పజిల్స్‌, బిల్డింగ్‌ లాజిక్‌ మరియు కంప్యూటేషనల్‌ థంకింగ్‌ ద్వారా ఈ అభ్యాసం కొనసాగుతుంది’’ అని అన్నారు.
 
కోడ్‌ చెఫ్‌ ఇప్పుడు ఉచిత అభ్యాస కార్యక్రమాన్ని ఐఓఐ ప్రిపరేషన్‌ కోసం యుఎన్‌ అకాడమీ ప్లాట్‌ఫామ్‌పై ఆరంభించింది. ఈ అభ్యాస కార్యక్రమంలో అంశం ఆధారంగా ప్రత్యక్ష తరగతలు, రికార్డెడ్‌ వీడియోలు, అనుమానాలను నివృత్తి చేసే సదస్సులను కోడ్‌ చెఫ్‌ వలెంటీర్లు చేస్తారు.
 
ఐఓఐ, ఐసీఓ మరియు కోడ్‌ చెఫ్‌
ప్రతి సంవత్సరం 85కు పైగా దేశాల నుంచి నలుగురు విద్యార్థులు చొప్పున ఐఓఐలో పాల్గొంటారు. ఐఓఐలో పాల్గొనే నలుగురు విద్యార్థులను జాతీయ స్థాయి ఒలింపియాడ్‌ ద్వారా ఎంపిక చేస్తారు. దీనినే ఇండియప్‌ కంప్యూటింగ్‌ ఒలింపియాడ్‌ (ఐసీఓ) అంటారు. ఐసీఓను కోడ్‌ చెఫ్‌ మరియు టీసీఎస్‌ అయాన్‌ మద్దతుతో ఇండియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ కంప్యూటింగ్‌ సైన్స్‌ (ఐఏఆర్‌సీఎస్‌) నిర్వహిస్తుంది.
 
భారతీయ పాఠశాల విద్యార్థులు కోసం ఐఓఐ 2021లో చేరుకునేందుకు చేయాల్సిన అంశాలు
1. జోనల్‌ ఇన్‌ఫార్మటిక్స్‌ఒలింపియాడ్‌ (జెడ్‌ఐఓ): ఐసీఓకు మొదటి రౌండ్‌ జెడ్‌ఐఓ. ఇది 19 డిసెంబర్‌ 2020వ తేదీ జరుగనుంది. ఈ రౌండ్‌లో ఎలాంటి ప్రోగ్రామింగ్‌ అవసరం లేదు. దీనికి రిజిస్ట్రేషన్‌లకు చివరి తేదీ డిసెంబర్‌ 07. నమోదు చేసుకోవడానికి learning.tcsionhub.in/exams/ico_2021/ చూడవచ్చు
 
2. ఇండియన్‌ నేషనల్‌ ఒలింపియాడ్‌ ఇన్‌ ఇన్‌ఫార్మిటిక్స్‌ (ఐఎన్‌ఓఐ): ఇది ఫిబ్రవరి 2021లో జరుగుతుంది. జెడ్‌ఐఓ నుంచి 250 మంది విద్యార్ధులు ఐఎన్‌ఓఐ కోసం షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఈ రౌండ్‌లో సీ++ ఖచ్చితంగా కావాల్సిన ప్రోగ్రామింగ్‌.
 
3. ఐఓఐ ట్రైనింగ్‌ క్యాంప్‌ (ఐఓఐటీసీ): ఈ శిక్షణా కార్యక్రమం చెన్నైలో మే 2021లో జరుగనుంది. ఐఎన్‌ఓఐ నుంచి ఈ రౌండ్‌కు 30 మంది విద్యార్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు.
 
4. ఇంటర్నేషనల్‌ ఒలింపియాడ్‌ ఇన్‌ ఇప్‌ఫార్మిటిక్స్‌ (ఐఓఐ): చివరి రౌండ్‌ను సింగపూర్‌లో నిర్వహిస్తారు మరియు ఐఓఐటీసీ నుంచి అగ్రస్ధానంలో నిలిచిన విద్యార్థులు దీనిలో భాగం కాగలరు.