శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 జనవరి 2023 (09:52 IST)

పదో తరగతి అర్హతతో ఏపీలో ఉద్యోగాలు...

Jobs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్హతతో సమగ్ర శిక్షా అభియాన్‌లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 60 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ, ఆపరేటర్ ఉపోస్టులు ఉండగా, ఈ పోస్టులకు ఈ నెలాఖరు లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
 
జూనియల్ అసిస్టెంట్ పోస్టులు 13, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 10, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 14 చొప్పున ఖాళీగా ఉన్నాయి. పోస్టును బట్టి పదో తరగతి నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అబ్యర్థులు అర్హులు. కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ స్కిల్స్ తప్పనిసరి. తెలుగు, ఇంగ్లీష్ చదవడం, రాయడం వచ్చి ఉండాలి. 2022 నవంబర్ 30 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 42 యేళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యాంగులకు ఐదేళ్ల వయో పరిమితి ఉంటుంది.
 
ఏపీ సమగ్ర శిక్షా అభియాన్ అధికారిక వెబ్‌సైట్ https://apssa.aptonline.in లో దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500గా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఫీజులో మాత్రం ఎలాంటి మినహాయింపు లేదు. 
 
ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రతిపాదికగా ఇతర పోస్టులకు స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో స్కిల్ టెస్ట్ నిర్వహించి, ఫిబ్రవరి 13న ఫలితాలను వెల్లడిస్తారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.23,500, డెటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు రూ.23,500, ఆఫీస్ సబార్డినేట పోస్టులకు రూ.15,000గా జీతంగా చెల్లిస్తారు.