మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 25 ఏప్రియల్ 2022 (16:43 IST)

మెంటీ నుంచి మెంటార్‌ వరకూ: అదనపు నైపుణ్యాలతో కెరీర్‌ను తీర్చిదిద్దుకున్న ఇంజినీర్‌

Image
ఆంధ్రప్రదే శ్‌లోని కర్నూలు జిల్లాలో మారుమూల గ్రామానికి చెందిన ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌, సరైన నైపుణ్యాలను పొందుతూ తన నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవడం ద్వారా తన కలల ఉద్యోగాన్ని మైక్రోసాఫ్ట్‌లో పొందాడు. సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌తో తన కెరీర్‌ ప్రారంభించిన అభినయ్‌ బింగుమల్ల, ఓ రైతు బిడ్డగా తన కలను అక్కడితో ఆపేయాలని కోరుకోలేదు.
 
ఉత్పత్తి ఆధారిత కంపెనీలో  చేరేందుకు అవసరమైన నైపుణ్యాలను పొందేందుకు అభినయ్‌, ప్రపంచంలో అగ్రగామి ఐటీ కంపెనీలలో ఒకదానిలో సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌గా కెరీర్‌ పొందడం కోసం నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. నూతనంగా పొందిన నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసంతో ఈ అభిరుచి కలిగిన ఇంజినీరింగ్‌ విద్యార్ధి, అభినయ్‌ ఇప్పుడు మరో 20 మంది ఔత్సాహిక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు మెంటారింగ్‌ చేస్తున్నాడు. వారు సైతం తమ కలల ఉద్యోగాలను పొందే ప్రయాణంలో దూసుకుపోతున్నారు.
 
బయోటెక్‌ ఇంజినీరింగ్‌లో స్పెషలైజేషన్‌ చేసిన అభినయ్‌ త్వరలోనే నైపుణ్యంతో కూడిన సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా  కావాల్సిన నైపుణ్యాలు తన దగ్గర లేవని గుర్తించాడు. అంతేకాదు, బయోటెక్నాలజీలో ఉద్యోగాలను పొందడం సులభ సాధ్యం కాదని కూడా తెలుసుకున్న అతను సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించాడు. ఉత్పత్తి ఆధారిత కంపెనీలలో ఇంటర్వ్యూల కోసం సిద్ధం కావడంతో పాటుగా త్వరలోనే అభినయ్‌ తనకు అల్గారిథమ్స్‌, డాటా స్ట్రక్చర్స్‌ పట్ల అవగాహన తక్కువని గుర్తించాడు. తన కలల ఉద్యోగం పొందేందుకు అది అవరోధంగా నిలువకూడదని అతను భావించాడు.
 
ముఖాముఖి మెంటారింగ్‌, అదనపు నైపుణ్యాలను సంతరించుకోవడంలోని ప్రయోజనాలను గుర్తించిన  అతను స్కేలర్‌పై తన ఉద్యోగం చేస్తూనే చేరాడు. నెలల తరబడి స్ధిరమైన ప్రయత్నాలు మరియు అంకితభావంతో అభినయ్‌ తన అప్‌స్కిల్లింగ్‌ కోర్సు పూర్తి చేశాడు. అది అతను మైక్రోసాఫ్ట్‌లో తన కలల ఉద్యోగం పొందేందుకు అవకాశం కల్పించింది. అవసరమైన నైపుణ్యాలను పొందిన తరువాత, అభినయ్‌, మైక్రోసాఫ్ట్‌ వద్ద తన బాధ్యతలను నిర్వహించేందుకు తగిన ఆత్మవిశ్వాసం పొందాడు.
 
అభినయ్‌ పొందిన ఈ ఆత్మవిశ్వాసమే అతను తిరిగి అభ్యాస కమ్యూనిటీకి తిరిగి ఇచ్చేందుకు తోడ్పడింది. ఉద్యోగ పరంగా పూర్తి బిజీగా అతను ఉన్నప్పటికీ స్కేలర్‌కు చెందిన ఉత్సాహపూరితమైన అభ్యాసకులకు మెంటారింగ్‌ చేయడానికి సమయం తీసుకున్నాడు. అభినయ్‌ ఇప్పుడు దాదాపు 20 మంది అభ్యాసకులకు మెంటారింగ్‌  చేయడంతో పాటుగా టెకీలు తమ లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతున్నాడు.
 
‘‘నేను అభ్యాసకులకు మెంటారింగ్‌ చేస్తున్నప్పుడు, తమ కెరీర్‌ కోణంలో వారు ఎక్కడ ఉన్నారనేది అర్ధం చేసుకున్నాను. చాలా  సార్లు వారిని చూస్తుంటే, నేను గతంలో ఎలా ఉన్నానో వారు అలాగే ఉన్నారనిపిస్తుంటుంది. నా ప్రయాణం కారణంగా, వారి పట్ల సానుభూతితో ఉండటంతో పాటుగా సరైన మార్గనిర్ధేశనం చేస్తున్నాను.  నా తొలి రోజుల్లో ఏ విధంగా అయితే మార్గనిర్దేశనం చేశానో అదే రీతిలో మార్గనిర్ధేశనం చేస్తున్నాను. నా నిరంతర అభ్యాసంలో మెంటారింగ్‌ నాకెంతగానో సహాయపడింది. అల్గారిథమ్స్‌ ట్రాక్‌ చేసేందుకు, డాటా నిర్మాణాలకు, ప్రస్తుత ధోరణులలో అత్యుత్తమంగా నిలువడంలో ఇది తోడ్పడుతుంది. అభ్యాస సమాజానికి తిరిగి ఇచ్చే క్రమంలో, ఈ డొమైన్‌లో ప్రతి ఒక్కటీ అందించేందుకు నాకు అనుమతిస్తుంది’’ అని  అభినయ్‌ బింగుమల్ల, స్కేర్‌ అల్యూమ్ని అన్నారు.
 
మైక్రోసాఫ్ట్‌ లాంటి సాంకేతిక దిగ్గజం వద్ద పనిచేయడం గురించి అభినయ్‌ మాట్లాడుతూ ‘‘నేను పనిచేస్తోన్న కొన్ని అంశాలు ప్రపంచ వ్యాప్తంగా  కోట్లాది మందిపై ప్రభావం చూపనున్నాయి. నేను చేసిన పని వల్ల పొందుతున్న సంతృప్తి అనంతం. ఇదే మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగిగా ప్రతిరోజూ అత్యుత్తమం చేసేందుకు ఇది నాకు స్ఫూర్తి కలిగిస్తుంది’’ అని అన్నారు.
 
ఆన్‌లైన్‌ టెక్‌వర్శిటీ స్కేలర్‌. వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ మరియు అప్‌స్కిల్లింగ్‌ విద్యార్ధులు కోసం అగ్రగామి కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు ఇది. సమగ్రమైన అప్‌ స్కిల్లింగ్‌ కోర్సులను స్కేలర్‌ అందిస్తుంది. టెక్‌ లీడర్లు, ఆయా అంశాలలో  నిపుణుల చేత ప్రత్యక్ష తరగతులను నిర్వహిస్తోంది. స్కేలర్‌ మెంటార్లు, ఔత్సాహిక ప్రతిభావంతులకు సహాయపడటంతో పాటుగా వారి కెరీర్‌ కలలను సాకారం చేసుకునేందుకు తోడ్పడుతుంది. అత్యంత జాగ్రత్తగా నిర్మించిన ఈ కార్యక్రమాలు సాఫ్ట్‌వేర్‌ నిపుణుల నైసుణ్యాలను ఆధునిక కరిక్యులమ్‌తో మెరుగుపరచడంతో పాటుగా తాజా సాంకేతికతల పట్ల అవగాహన కూడా కల్పిస్తుంది. డిమాండ్‌లో ఉన్న సాంకేతిక నైపుణ్యాలను స్కేలర్‌ అందించడంతో పాటుగా సుప్రసిద్ధ టెక్‌ కంపెనీల వద్ద ఇంటర్వ్యూ ప్రక్రియ విధానాన్ని పరిచయం చేసింది.
 
స్కేలర్‌  మరియు ఇంటర్వ్యూబిట్‌ కో –ఫౌండర్‌ అభిమణ్యు సక్సేనా మాట్లాడుతూ, ‘‘కేవలం 55% మంది భారతీయ ఇంజినీర్లు మాత్రమే ఉద్యోగార్హత సాధిస్తుంటే, వారిలోనూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల సంఖ్య ఇంకా తక్కువగా ఉంటుంది. ఇండస్‌వ్యాలలీ 2022 నివేదిక ప్రకారం, కేవలం 4% మంది మన కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీర్లు అత్యున్నత నాణ్యత కలిగిన కోడ్‌ రాయగలుగుతున్నారు. ఇది భారతీయ ఐటీ పరిశ్రమలో మరింతగా నైపుణ్యవంతులైన ప్రతిభావంతుల అవసరాన్ని తెలుపుతుంది.
 
అభినయ్‌ లాంటి కొంతమంది మాత్రమే తమ సమయం కేటాయించడంతో పాటుగా నేర్చుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓ దేశంగా మనం మన ప్రతిభావంతుల సంఖ్య మెరుగుపరచుకోవాల్సి ఉంది. దీనితో పాటుగా నిరంతర అభ్యాసం కూడా ఈ అభ్యాసకులకు అత్యంత కీలకం. తగిన మార్గనిర్దేశనం ఉంటే ఈ అభ్యాసకులు మరింతగా ముందుకు వెళ్లగలరు. అభినయ్‌ లాంటి టెకీల ప్రయత్నాలు, మెంటార్‌ కమ్యూనిటీ తోడ్పాటు ఉంటే మన ఇంజినీర్ల ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా మెరుగుపడతాయి’’ అని అన్నారు.