10, 19, 28 తేదీల్లో జన్మించిన వారైతే.. ఇలా వుంటారు?

PNR| Last Updated: సోమవారం, 9 జూన్ 2014 (17:47 IST)
పది, పంతొమ్మిది, ఇరవై ఎనిమిది తేదీల్లో జన్మించిన జాతకులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆస్తులు చేతికందడంతో పాటు వ్యాపారం, వృత్తుల్లో రాణిస్తారు. పై చదువుల కోసం విదేశాలకు ప్రయాణమవుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు, వృత్తిపరంగా సానుకూల సంకేతాలు లభిస్తాయి.

ప్రభుత్వరంగ ఉద్యోగాల్లో ఉండే వారికి ప్రమోషన్లు వుంటాయి. అయితే చిన్న చిన్న అవకాశాల కోసం మీ మర్యాద, గౌరవాన్ని తగ్గించుకోకండి. కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహప్రవేశం, వాహనాల కొనుగోలు చేస్తారు. దీనికోసం ఫైనాన్స్ కూడా లభిస్తుంది.

కళ్లు, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు రావొచ్చు. అయితే వైద్యుల సలహాలను పాటిస్తే ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన మహిళలు లేదా పురుషులు రాహు-కేతువులకు అర్చన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అనుకున్న కార్యాలు నెరవేరుతాయి.దీనిపై మరింత చదవండి :