ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 జనవరి 2023 (11:17 IST)

టెక్కీ ప్రాణం తీసిన చెన్నై రోడ్డు.. తమ్ముడిని స్కూల్ లో దింపేందుకు వెళ్తూ...?

Techie
Techie
చెన్నైలోని మధురవాయల్ సమీపంలో ఓ మహిళ గుంతలో పడి లారీ కింద ఇరుక్కుపోయిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని పోరూర్‌కు చెందిన శోభన (22) అనే యువతి జోకో అనే ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం తన తమ్ముడిని స్కూల్లో దింపేందుకు వెళ్లింది. 
 
మధురవాయల్‌లో రోడ్డు దాటుతుండగా గుంతలో బండి దిగడంతో శోభన కిందపడిపోయింది. ఆపై ఇసుక లోడుతో వేగంగా వస్తున్న లారీ శోభన వాహనంపై ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అదృష్టవశాత్తూ శోభన తమ్ముడు ఈ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దీంతో స్థానికులు శోభన తమ్ముడిని ఆస్పత్రికి తరలించారు.
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమై పరారీలో వున్న లారీ డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు. రోడ్డుపై ఉన్న గుంతలే ప్రమాదానికి కారణమని చెబుతుండగా, కొద్ది గంటల్లోనే గుంత ఇసుక, కంకరతో నిండిపోయింది. రోడ్లపై గల గుంతలు ప్రాణాలను 
 
శోబన మృతికి సంతాపం తెలుపుతూ జోకో సీఈవో శ్రీధర్ వెంబు ట్వీట్ చేస్తూ, "మా ఇంజనీర్లలో ఒకరైన శ్రీమతి శోభన చెన్నైలోని మధురవాయల్ సమీపంలో గుంతలు పడిన రోడ్లపై స్కూటర్ జారిపడిపోవడంతో విషాదకరంగా మరణించింది. తమ్ముడిని స్కూల్‌కి తీసుకెళ్లింది. "మా అద్వానమైన రోడ్ల కారణంగా శోభన కుటుంబానికి తీవ్ర నష్టం జరిగింది.."అంటూ సంతాపం వ్యక్తం చేశారు. పోలీసులు మాత్రం శోభన హెల్మెట్ ధరించలేదని చెప్తున్నారు.