వరద బాధితుల కోసం 'ద్రవిడ దేశం' ఆపన్న హస్తం : వి.కృష్ణారావు వెల్లడి
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా తమిళనాడు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో ప్రజలు జల దిగ్బంధంలో చిక్కుకొని అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విషయం ద్రావిడ దేశం దృష్టికి వచ్చింది. ముఖ్యంగా చెన్నై నగరంతోపాటు ప్రక్కనే ఉన్న చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలలో లోతట్టు ప్రాంతాల్లో నివశిస్తున్న తెలుగు ప్రజలు ముఖ్యంగా వలస కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అనేక రోడ్లన్నీ జలమయం అయిన కారణంగా పలు చోట్ల రవాణా సౌకర్యం కూడా రద్దయినట్లు తెలుస్తుంది. అనేక ప్రాంతాల నుండి తమకు సహాయం అందించాలని ద్రావిడ దేశం కార్యాలయానికి విన్నపాలు వస్తున్నాయి.
కరోనా మహమ్మారి కారణంగా తమిళనాడు రాష్ట్రంలో చిక్కుకున్న అనేక మంది వలస కూలీల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన విధంగానే వరదల్లో చిక్కుకున్న తెలుగు ప్రజలకు కూడా సహాయ సహకారాలు అందించాలని "ద్రావిడ దేశం" కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి వరద బాధితులు తమ తమ ప్రాంతాల్లో ఉన్న కార్పొరేషన్ కార్యాలయంలోగానీ లేదా తాలూకా తాసిల్దార్ కార్యాలయంలోగాని అధికారులతో కలిసి తమ బాధలను లిఖితపూర్వకంగా అందజేయాలని కోరుతున్నాం.
వరద బాధితులు తమ సమస్యలను 9381003348 అనే మొబైల్ నెంబర్‌కు వాట్సప్ ద్వారా తెలియజేసి తమ పూర్తి వివరాలను మరియు వారి కాంటాక్ట్ నెంబర్‌ను తెలియజేస్తే "ద్రావిడ దేశం" ఆ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వంతో సంప్రదించి తగిన సహాయ సహకారాలు అందించడానికి తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తున్నాం.
అదేవిధంగా 20 మందికి పైగా బాధితులు ఉన్నట్లు అయితే వారికి రవాణా సౌకర్యం కూడా ప్రభుత్వ సహకారంతో అందించడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నట్టు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.కృష్ణారావు సోమవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.