మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 ఆగస్టు 2020 (15:17 IST)

షాకింగ్ న్యూస్ : తమిళనాడులో కరోనా వైరస్ సోకి 32 మంది వైద్యుల మృతి

తమిళనాడు రాష్ట్రంలో షాకింగ్ న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారినపడి ఇప్పటివరకు 32 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఈ విషయాన్ని ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్‌ త‌మిళ‌నాడు శాఖ వెల్లడించింది. 
 
మ‌రో 15 మంది డాక్ట‌ర్లు కూడా క‌రోనా ల‌క్ష‌ణాల‌తో చ‌నిపోయారు. కానీ వారికి ప‌రీక్ష‌లు చేస్తే క‌రోనా నెగిటివ్ ఫ‌లితం వ‌చ్చిన‌ట్లు తెలిపింది. 32 మంది డాక్ట‌ర్ల‌కు ఆర్‌టీ-పీసీఆర్ ప‌రీక్ష‌లు చేయ‌గా కొవిడ్ పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్ల పేర్కొంది. 
 
వైద్యుల ప‌ట్ల ప్ర‌భుత్వం స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని వైద్య సంఘాలు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్ర‌భుత్వం మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వైద్యులు ఆరోపిస్తున్నారు. 
 
కాగా, దేశంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. ముఖ్యంగా, కరోనా వైరస్ హాట్‌స్పాట్‌గా చెన్నై కోయంబేడు మార్కెట్ నిలిచిన విషయం తెల్సిందే. ఇక్కడ నుంచి తమిళనాడులోని ఇతర జిల్లాలతో పాటు.. పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా కరోనా వైరస్ వ్యాపించినట్టు తేలింది. 
 
ప్రస్తుతం శనివారం సాయంత్రం వరకు ఈ రాష్ట్రంలో 3.32 లక్షల మంది ఈ వైరస్ బారినపడగా, 2.72లక్షల మంది కోలుకున్నారు. ఒక్క చెన్నై నగరంలోనే 1.15 లక్షల మందికి ఈ వైరస్ సోకింది.