8వ అంతస్తు నుంచి దూకిన చెన్నై టెక్కీ... బలవన్మరణం!
చెన్నైలో అనుమానాస్పద స్థితిలో సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను పని చేసే భవనంలోని ఎనిమిదో అంతస్తు నుంచి కిందికి దూకడంతో ఆ టెక్కీ ప్రాణాలు విడిచాడు. అరియలూరు, ఉళుందూరుపేటకు చెందిన అరవింద్ (25). ఇతను చెన్నై దురైప్పాక్కంలోని ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు.
చెన్నైలోని తిరువాన్మియూరు భారతిదాసన్ వీధిలో ఒక అద్దె ఇంటిలో నివశిస్తూ ప్రతిరోజూ విధులకు హాజరయ్యేవాడు. గురువారం రాత్రి అరవింద్ ఆఫీస్ పని ముగించుకుని ఇంటికి బయలుదేరేందుకు బయటకు వచ్చి.. ఉన్నట్టుండి ఎనిమిదో అంతస్తు నుంచి కిందకు దూకాడు.
తీవ్ర రక్తస్రావమైన అరవింద్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. అయితే మార్గం మధ్యలోనే అరవింద్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న దురైపాక్కం ఇన్‌స్పెక్టర్ మహేశ్‌కుమార్ అరవింద్ ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నారు.