1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : శనివారం, 28 జూన్ 2014 (15:31 IST)

బాలింతలు ఎన్నాళ్లపాటు పిల్లలకు పాలివ్వాలి?

బాలింతలు పిల్లలకు ఎన్ని నెలలు పాలివ్వాలంటే.. కనీసం ఆరు నెలల పాటు బాలింతలు పాలు పట్టాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. పిల్లలకు కనీసం ఆరు నెలలైనా పాలుపట్టడం వల్ల శిశువు కడుపులో ఓ లేయర్ ఫామ్ అవుతుందని తద్వారా ఫస్ట్ ఫుడ్ ఇవ్వడం ద్వారా ఎలాంటి హానీ కలగదు. 
 
కనీసం ఆరు నెలల పాటు పాలివ్వడం ద్వారా శిశువుకు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు దరిచేరవు. ఆరు నెలలకు ముందే ఫస్ట్ ఫుడ్‌ ఇస్తే సమస్యలు తప్పవని చైల్డ్ కేర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. శిశువుకు సరైన పోషకాలు అందాలంటే కనీసం ఆరు నెలలైనా తల్లి పాలు ఇవ్వడమే మేలని వారు సూచిస్తున్నారు.  
 
తల్లిపాలులో విటమిన్లు, ఇతర శక్తులు పుష్కలంగా ఉన్నాయి. ఆరు నెలలే కాకుండా అంతకుపైనా తల్లిపాలు పడితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా అనారోగ్య సమస్యలు ఏర్పడవని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.