శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చైనీస్
Written By Selvi
Last Updated : శుక్రవారం, 14 నవంబరు 2014 (17:16 IST)

టమోటా సూప్‌లో క్యారెట్ తురుము వేస్తే?

టమోటా సూప్ చేసేటప్పుడు క్యారెట్ వేస్తే పులుపు తగ్గటంతోపాటు పోషకవిలువలు వస్తాయి. టమోటాలు ఉడికించేటప్పుడు ఒక టేబుల్ స్పూను పంచదార, ఉప్పు కలిపితే త్వరగా ఉడుకుతాయి. 
 
దోసె పిండిలో ఒక చెంచా వెనిగర్ వేశారంటే, అట్టు చిల్లు చిల్లులుగా వస్తుంది. ముఖ్యంగా రవ్వట్టుకు ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నిమ్మరసం ఎక్కువగా రావాలంటే పది నిముషాలపాటు గోరు వెచ్చటి నీటిలో వేసి ఉంచాలి. 
 
ఒకవేళ ఫ్రిజ్‌లో ఉంటే రసం తీయటానికి పది నిమిషాల ముందు బయటపెట్టాలి. 
పరమాన్నం మరింత టేస్టీగా ఉండాలంటే, బియ్యాన్ని నెయ్యి వేసి కొంచెం సేపు వేయించి ఆ బియ్యంతో పరమాన్నం చేయాలి.