మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. కాంటినెంటల్
Written By PNR
Last Updated : శుక్రవారం, 5 సెప్టెంబరు 2014 (18:54 IST)

"కోకో ఐస్‌క్రీం" ఇంట్లో తయారీ ఎలా..??

కావలసిన పదార్థాలు :
పాలు.. ఒక లీటర్
క్రీం.. 500 మి.లీ.
పంచదార.. 100 గ్రా.
కోడిగుడ్లు.. పది
కోకో పౌడర్.. 6 టీ.
 
తయారీ విధానం :
ముందుగా ఒక పాత్రలో పాలు మరిగించి పక్కన ఉంచుకోవాలి. మరో పాత్రలో కోడిగుడ్ల తెల్లసొన మాత్రమే తీసుకోవాలి. ఇందులోనే పంచదార, మరిగించిన పాలు చేర్చి కలియబెట్టి తక్కువ మంటపై ఉడికించాలి. ఈ మిశ్రమం కాసేపటి తరువాత కస్టర్డ్‌లాగా తయారవుతుంది. పూర్తిగా చల్లారిన తరువాత ఈ మిశ్రమానికి కోకో పౌడర్ చేర్చి, ఐస్ ట్రేలోకి పోసి డీప్ ఫ్రీజ్‌లో ఉంచాలి.
 
అలా ఐస్‌ ట్రేలలో పెట్టిన మిశ్రమం ఐస్‌క్యూబులా గట్టిగా మారుతుంది. తరువాత ఈ క్యూబును తీసి నీళ్లు పోయకుండా మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మళ్లీ ఈ మిశ్రమాన్ని ట్రేలో పెట్టి నాలుగ్గంటలపాటు డీప్ ఫ్రీజ్‌లో ఉంచాలి. మళ్లీ దాన్ని తీసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బితే చల్ల చల్లగా నురగలు గక్కుతుండే కోకో ఐస్‌కీం సిద్ధమైనట్లే.