శనివారం, 2 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 11 నవంబరు 2014 (12:05 IST)

కట్ చేసిన ఆపిల్ రంగు మారకుండా ఉండాలంటే...?

కట్ చేసిన ఆపిల్ ముక్క రంగు మారకుండా ఉండాలంటే కట్ చేసిన భాగానికి కొద్దిగా నిమ్మరసాన్ని తాకించాలి. ఇలా చేస్తే ఆపిల్ ఎక్కువ సేపు రంగు మారకుండా ఉంటుంది.
 
బాదం పప్పు చర్మాన్ని సులువుగా తొలగించాలంటే వాటిని 15-20 నిమిషాల పాటు వేడి నీళ్లలో నానబెడితే తొందరగా తొలగించవచ్చు.
 
చక్కెర డబ్బాలో 4-5 లవంగం మొగ్గలు ఉంచి మూత పెట్టినట్లయితే చీమల బెడద ఉండదు.
 
బిస్కెట్లు ఉంచే డబ్బా అడుగు భాగాన బ్లాట్టింగ్ పేపర్ ముక్కలు ఉంచినట్లుయితే బిస్కెట్లు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.