మంగళవారం, 8 జులై 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 30 నవంబరు 2015 (18:12 IST)

సాంబారులో మునక్కాయలను ఎలా వేయాలంటే?

సాంబారులో మునక్కాయలను వేసే సమయంలో వాటిని అలానే వేయకుండా ముక్కలను మధ్యలోకి రెండుగా చీల్చి వేస్తే రుచిగా ఉండడమే కాకుండా వాసనగా కూడా ఉంటుంది.
 
కొబ్బరి పాల కోసం
కొబ్బరి నుంచి ఎక్కువగా పాలు తీయాలనుకుంటే వేడినీటిలో కొబ్బరి తురుమును వేసి కాసేపు మూత పెట్టి ఉంచాలి. ఆ తర్వాత దీనిని తీసి పాలు పిండితో ఎక్కువగా ఒకేసారి వచ్చేస్తాయి.
 
వెల్లుల్లి తొక్కలను సులువుగా తీయాలంటే.. 
ఉల్లి, వెల్లుల్లి, పనస పండు గింజల తోలును సులభంగా తీయాలంటే వాటిపైన కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను వేసి చూడండి. మర్నాడు వాటిని తీయడానికి సమయం పట్టదు.
 
వంకాయలో పెరుగు
వంకాయలను ఉడికించే సమయంలో చిటికెడు పెరుగు వేస్తే వాటి రంగు మారకుండా అలానే ఉంటుంది. అలాగే అరటి పువ్వును కోసి నీటిలో వేసే సమయంలో కాస్త పెరుగు కలిపితే చేతికి పువ్వు మరకలు అంటకుండా ఉండడంతో పాటు పువ్వు కూడా చాలా మృదువుగా ఉంటుంది.